సీరమ్ సంస్థ తయారు చేసిన కొవిషీల్డ్ వ్యాక్సిన్ నేపాల్‌కు చేరింది. ఆదివారం ఉదయం భారత్ నుంచి టీకాలను తీసుకువచ్చిన ఎయిర్ ఇండియా విమానం త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని చేరినట్లు భారత దౌత్య కార్యాలయం అధికారులు తెలిపారు. సమారు పది లక్షల వ్యాక్సిన్లు అందినట్లు పేర్కొన్నారు.
మొత్తంగా 20 లక్షల వ్యాక్సిన్లను పుణెలోని సీరం సంస్థ నుంచి కొనుగోలు చేయాలని నేపాల్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే భారత్ మరో పది లక్షల డోసులను నేపాల్‌కు బహుమతిగా ఇచ్చింది. మొదటి ప్రాధాన్యంగా టీకాను ఆరోగ్య కార్యకర్తలు, భద్రతా సిబ్బంది, జర్నలిస్టులకు ఇస్తోంది నేపాల్. త్వరలో వృద్ధులకు కూడా టీకాను అందించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు నేపాల్ మంత్రిత్వశాఖ వెల్లడించింది.
ఇదీ చూడండి: 'కొవిషీల్డ్' టీకాకు నేపాల్ అత్యవసర అనుమతి