కొద్ది రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలకు నేపాల్లో జనజీవనం అస్తవ్యస్తమయింది. వరదల కారణంగా దేశవ్యాప్తంగా మృతి చెందిన వారి సంఖ్య 28కి చేరింది. వరదల్లో గల్లంతయిన 16 మంది ఆచూకీ ఇంకా లభించలేదు.
లలిత్పుర్, కావ్రే, కొటాంగ్, భోజ్పురి, మకాన్పురిలో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడ్డాయి. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమై... చెరువులను తలపిస్తున్నాయి.
సహాయ చర్యలు ముమ్మరం చేశారు అధికారులు. వరదల్లో చిక్కుకున్న సుమారు 50 మందిని రక్షించారు. వరదల కారణంగా 6 వేల మంది వరకు నిరాశ్రయులయినట్లు చెప్పారు.
ఇదీ చూడండి: నేపాల్లో భారీ వర్షాలు- 17 మంది బలి