చైనాలోని షిన్జియాంగ్, టిబెట్‌లో మైనారిటీ వర్గాలపై ఆ దేశం వ్యవహరిస్తున్న తీరును 40 పశ్చిమ దేశాలు విమర్శించాయి. హాంకాంగ్‌లోని మానవహక్కులపై నూతన జాతీయ భద్రత చట్టం ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేశాయి. షిన్జియాంగ్లో పరిస్థితుల అధ్యయానికి ఐరాస మానవ హక్కుల కమిటీ అధ్యక్షురాలు మిచెల్లీ బాచ్‌లెట్ సహా ఇతర స్వతంత్ర పరిశీలకులకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశాయి.
ఇదీ చూడండి: చైనాలో మైనారిటీల అణచివేతకు 380 నిర్బంధ కేంద్రాలు!
అమెరికా, జపాన్ కూడా..
చైనా తీరుపై ఆందోళన వ్యక్తం చేసిన దేశాల్లో అమెరికా, జపాన్ సహా ఐరోపా దేశాలు ఉన్నాయి. హాంకాంగ్ స్వయంప్రతిపత్తిని ఆమోదించడమే కాకుండా ఆ దేశ న్యాయవ్యవస్థను గౌరవించాలని 40 దేశాలు కోరాయి. ఈ మేరకు ఐరాస మానహక్కుల కమిటీ సాధారణ సమావేశంలో సంయుక్త ప్రకటనను వెల్లడించాయి.
పాక్ మద్దతుగా..
హాంకాంగ్-చైనా వ్యవహారాల్లో ఇతర దేశాలు జోక్యం చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ 55 దేశాల మద్దతుతో చైనా తరఫున పాకిస్థాన్ ప్రకటన చేసింది. దీనితో చైనా, పశ్చిమ దేశాల మధ్య మానవహక్కుల అంశంలో విబేధాలు పెరిగినట్లు తెలుస్తోంది.
ఇదీ చూడండి: చైనాలో 16వేల ప్రార్థనా మందిరాలు ధ్వంసం!