ETV Bharat / international

ఆర్మేనియా- అజర్‌బైజాన్‌ మధ్య నూతన ఒప్పందం

రష్యా మధ్యవర్తిత్వంతో ఆర్మేనియా, అజర్​బైజాన్​ల మధ్య ఉద్రిక్తతలు తగ్గినట్లు కనిపిస్తున్నాయి. వివాదాస్పద నాగోర్నో-కరాబఖ్​ ప్రాంతంపై ఆధిపత్యం కోసం.. కొన్నిరోజులుగా పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి ఈ దేశాలు. తాజాగా ఈ ప్రాంతంలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ప్రకటించాయి.

armenia and azerbaijan
ఆర్మేనియా-అజర్‌బైజాన్‌ మధ్య నూతన ఒప్పందం
author img

By

Published : Oct 18, 2020, 9:44 AM IST

కొన్ని రోజులుగా దాడులతో ఉద్రిక్తంగా మారిన నాగోర్నో-కరాబఖ్‌ ప్రాంతంలో.. నూతన కాల్పుల విరమణ ఒప్పందానికి ఆర్మేనియా- అజర్‌బైజాన్‌ దేశాలు అంగీకరించాయి. ఈ మేరకు తాజా ఒప్పందంపై జరిపిన చర్చల్లో... ఏకాభిప్రాయానికి వచ్చినట్లు ఇరుదేశాల విదేశాంగ మంత్రులు ప్రకటించారు. వారం రోజుల వ్యవధిలో రెండు దేశాల మధ్య ఇది రెండో కాల్పుల విరమణ ఒప్పందం.

ఇప్పటికే ఈ నెల 10న ఆర్మేనియా- అజర్‌బైజాన్‌ మధ్య రష్యా నేతృత్వంలో తొలి ఒప్పందం జరిగింది. అయితే శనివారం నాగోర్నో-కరాబఖ్‌ ప్రాంతంలో ఆర్మేనియా క్షిపణి దాడికి పాల్పడిందని అజర్‌బైజాన్‌ ఆరోపించగా.. ఆర్మేనియా ఆ వార్తలను ఖండించింది.

అసలు గొడవేంటి?

సోవియట్ యూనియన్​ విచ్ఛిన్నం కాకముందు 1991లో నాగోర్నో-కరాబాఖ్ ప్రాంతం అజర్​బైజాన్ నియంత్రణలో ఉండేది. అయితే అనంతర కాలంలో ఆ ప్రాంతానికి స్వాతంత్ర్యం లభించింది. 1992లో ఈ ప్రాంతం కోసం ఆర్మేనియా-అజర్​బైజాన్​ల మధ్య యుద్ధం జరిగింది. ఇందులో దాదాపు 30,000 మంది ప్రజలు చనిపోయారు. 1994లో యుద్ధం అంతిమ దశకు వచ్చేనాటికి ఆర్మేనియా వివాదాస్పద ప్రాంతంతో పాటు దాని సమీపంలోని మడగిజ్​ను కూడా ఆక్రమించింది.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.