ఉత్తరకొరియాలో ఐదేళ్లల్లోనే తొలిసారిగా అధికార పార్టీ కాంగ్రెస్ సమావేశాన్ని నిర్వహించిన అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్.. దేశంలో తమ విధానాలు విఫలమయ్యాయని అంగీకరించారు. సరికొత్త అభివృద్ధి లక్ష్యాలను నిర్దేశించుకుని తగిన ప్రణాళికలను అమలు చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ విషయాన్ని ఆ దేశ ప్రభుత్వ ఆధారిత మీడియా వెల్లడించింది.
2016లో కాంగ్రెస్ నిర్దేశించుకున్న అభివృద్ధి లక్ష్యాలు చేరుకోలేదని.. భవిష్యత్తులు దీనిని పునరావృత్తం చేయకూడదని కిమ్ తెలిపారు. పాంగ్యాంగ్లో ఏర్పాటు చేసిన వర్కర్స్ పార్టీ కాంగ్రెస్‌కు హాజరైన వేలాది మంది సమక్షంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇదీ చూడండి:- నన్ను క్షమించండి అంటూ 'కిమ్' కన్నీరు.!
ఎన్నో సవాళ్లు..
ఎన్నో సవాళ్లు, సంక్షోభాల మధ్య ఉత్తరకొరియాలో ఈసారి కాంగ్రెస్ సమావేశాలు జరుగుతున్నాయి. కరోనా కారణంగా దేశ సరిహద్దులు మూతపడటం, ఆర్థిక వ్యవస్థ కుదేలవడం, గతేడాది సంభవించిన ప్రకృతి వైపరిత్యాలతో ఉత్తరకొరియా అతలాకుతలమైంది.
ఈ నేపథ్యంలో అమెరికాతో సంబంధాలు కూడా కిమ్‌కు క్లిష్టంగా మారాయి. ఇప్పటికే ఉత్తరకొరియాపై ఆంక్షలతో విరుచుకుపడుతోంది అమెరికా. మరికొన్ని రోజుల్లో అగ్రరాజ్య అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకోనున్న జో బైడెన్.. మరింత కఠినంగా వ్యవహరించే అవకాశముండటం కిమ్‌కు అత్యంత ఆందోళన కలిగించే విషయం.
ఇదీ చూడండి:- కిమ్ 'కొత్త' సందేశం- 1995 తర్వాత ఇదే!