మోన్ రాష్ట్రంలోని థే ప్యార్ కోన్ గ్రామంలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో 16 ఇళ్లు, ఒక ఆశ్రమం పూర్తిగా ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
" ఇప్పటి వరకు 34 మృతదేహాలు లభించాయి. మృతదేహాల వెలికితీత ఇంకా కొనసాగుతోంది."
- స్థానిక అధికారి.
రహదారిపై 1.8 మీటర్ల మేర బురద
కొండచరియలు విరిగిపడిన ఘటనలో.. యాంగోన్-మావ్లామైన్ మధ్య రహదారి మూసుకుపోయింది. సుమారు 1.8 మీటర్ల మేర బురద పేరుకుపోయింది. వాహనాల రాకపోకలు స్తంభించాయి.
మయన్మార్లో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటి వరకు సుమారు 89 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు.
ఇదీ చూడండి: 'పర్యావరణ సంరక్షణ'కై స్విట్జర్లాండ్ వాసుల నిరసన బాట