ETV Bharat / international

ట్రంప్​తో మోదీ​ ఏం మాట్లాడారంటే..? - కశ్మీర్​

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌లో సంభాషించారు. సుమారు 30 నిమిషాల పాటు జరిగిన ఈ సంభాషణలో ఇరు దేశాల ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ఉగ్రవాద నిర్మూలన, సీమాంతర ఉగ్రవాదం తదితర అంశాలపై అగ్రనేతలిద్దరూ చర్చించారు. భారత్​పై పాక్​ ప్రధాని చేస్తున్న దురుసు వ్యాఖ్యాలు శాంతికి విఘాతమని మోదీ​ అభిప్రాయపడ్డారు.

ట్రంప్​తో మోదీ​ ఏం మాట్లాడారంటే..?
author img

By

Published : Aug 20, 2019, 5:08 AM IST

Updated : Sep 27, 2019, 2:45 PM IST

ట్రంప్​తో మోదీ​ ఏం మాట్లాడారంటే..?

కశ్మీర్​లో 370 అధికరణ రద్దు అనంతరం భారత్​-పాక్​ మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. ఈ విషయంపై తొలిసారి అగ్రదేశ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​తో భారత ప్రధాని నరేంద్ర మోదీ సంభాషించారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు సహా పలు కీలక విషయాలపై చర్చించారు. ముఖ్యంగా కశ్మీర్​ పరిణామం అనంతరం పాకిస్థాన్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ చేసిన వ్యాఖ్యలు, అనుసరిస్తోన్న విధానాలపై ప్రధాని మోదీ అభ్యంతరం వ్యక్తం చేశారు.

సుమారు 30 నిమిషాల పాటు సాగిన ఈ ఫోన్​ సంభాషణపై ప్రధాని కార్యాలయం వరుస ట్వీట్లు​ చేసింది.

"అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​, ప్రధాని మోదీ మధ్య ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలు చర్చకు వచ్చాయి. ఈ సంభాషణ స్నేహపూర్వకంగా సాగింది. సరిహద్దుల్లో ఉగ్రవాద నియంత్రణ, హింసా, తీవ్రవాదం లేని వాతావరణం ఏర్పాటు ఆవశ్యకతను ప్రధాని మోదీ ముఖ్యంగా ప్రస్తావించారు. పేదరికం, నిరక్షరాస్యతపై పోరాడేందుకు కలిసి వచ్చే ఎవరితోనైనా నిబద్ధతతో సహకరిస్తామని మోదీ తెలిపారు." - ప్రధాని కార్యాలయం ట్వీట్​.

ఈ ఏడాది జూన్‌ నెలాఖరులో ఒసాకాలో జరిగిన జీ20 సదస్సులో ఇరు దేశాల మధ్య చర్చకు వచ్చిన అంశాలను ప్రధాని ఈ సందర్భంగా ప్రస్తావించారు.

శ్వేతసౌధం స్పందన...

మోదీ, ట్రంప్ ఫోన్​ సంబాషణపై శ్వేతసౌధం స్పందించింది.

"భారత్​-పాక్​ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గించేందుకు.. ఇరు దేశాల్లోనూ శాంతియుత వాతావరణం కొనసాగడం చాలా ముఖ్యమని అధ్యక్షుడు ట్రంప్​ మోదీకి తెలిపారు.​ అమెరికా-భారత్​ మధ్య వాణిజ్య బంధం బలోపేతమవ్వాలని అధ్యక్షుడు ఆకాంక్షించారు." - శ్వేతసౌధం

Korea (Chhattisgarh), Aug 20 (ANI): A man was arrested for thrashing his pregnant wife and also giving her triple talaq in Chhattisgarh's Korea district on August 19. He was booked under Manendragarh police station limits of Korea district. While speaking to ANI on this matter, Police official said, "She (victim) was beaten up by her in-laws and husband. Case is registered against him under Muslim Women (Protection of Rights on Marriage) Act, 2019 and Indian Penal Code (IPC)." Meanwhile, while speaking to media, the triple talaq victim added, "Since five years I was being thrashed by my in-laws and husband. Today also I was beaten up and he (my husband) gave me triple talaq." "When I told him he will have to give me money for our children, he refused, threatened me and threw me out. I am pregnant," she further stated. Triple Talaq Bill was passed in Rajya Sabha on July 30 criminalising men for divorcing by uttering talaq thrice.
Last Updated : Sep 27, 2019, 2:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.