ETV Bharat / international

ఎలుకలు కలుషితం చేసిన ఆహారం తిన్నా: మరియం

ఇమ్రాన్​ ఖాన్​ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు పీఎంఎల్-ఎన్​ ఉపాధ్యక్షురాలు మరియం నవాజ్​. జైల్లో తనకు ఎలుకలు కలుషితం చేసిన ఆహారాన్ని అందించారని ఆరోపించారు. ఇమ్రాన్​ఖాన్​ సర్కార్​కు రోజులు దగ్గర పడ్డాయని ధ్వజమెత్తారు.

Maryam Nawaz accuses PTI govt of providing her rat-contaminated food in Lahore's Jail
'జైల్లో ఎలుకలు తినే ఆహారాన్ని అందించారు'
author img

By

Published : Nov 27, 2020, 8:38 PM IST

జైల్లో తనకు ఎలుకలు పడ్డ కలుషిత ఆహారాన్ని అందించారని.. ఇమ్రాన్​ ఖాన్​ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు పీఎంఎల్-ఎన్​ ఉపాధ్యక్షురాలు మరియం నవాజ్. జర్నలిస్టులతో జరిగిన అనధికారిక సమావేశంలో ఆమె ఈ విషయాలను బయటపెట్టారని తెలుస్తోంది. ఆ సమాచారం ప్రకారం.. జైల్లో తనకిచ్చిన ఔషధాలు సైతం నాసిరకమని ఆరోపించారు. జైలు గదిలో, బాత్రూంలో సీసీకెమెరాలను ఏర్పాటు చేశారని మండిపడ్డారు.

ఇమ్రాన్​ ఖాన్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని ధ్వజమెత్తారు. ప్రస్తుతం దేశంలో గ్యాస్​ సంక్షోభం నెలకొందన్నారు.

"నేను ఇప్పటికి రెండు సార్లు జైలుకు వెళ్లాను. ఒక మహిళతో జైల్లో ఎలా వ్యవహరించారో చెప్తే ఇమ్రాన్​ఖాన్ ప్రభుత్వం సిగ్గుతో తలదించుకుంటుంది."

-- మరియం నవాజ్, పీఎంఎల్-ఎన్​ ఉపాధ్యక్షురాలు.

అయితే, మరియం నవాజ్​ వ్యాఖ్యల్లో వాస్తవం లేదని ప్రధాన మంత్రి సలహాదారు మీర్జా షాజాద్​ అక్బర్ అన్నారు. ఆమెకు వారి ఇంట్లో చేసిన భోజనాన్ని మాత్రమే అందించామని తెలిపారు. అబద్ధాలు మాట్లాడటం వారి కుటుంబ సంప్రదాయం అని విమర్శించారు.

మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన మరియం నవాజ్, లాహోర్​ సెంట్రల్​ జైలులో శిక్ష అనుభవించి గతేడాది నవంబరులో విడుదలయ్యారు.

ఇదీ చదవండి: ​పాక్‌లో తీవ్ర రాజకీయ సంక్షోభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.