ETV Bharat / international

10 నిమిషాల్లో 1.5 లీటర్లు తాగి.. చివరకు ప్రాణాలు విడిచి...

మీకు కూల్​డ్రింక్​ గడగడా తాగే అలవాటుందా? ఎత్తిన సీసాను దించకుండా తాగేయడం మీకు ఇష్టమా? అయితే జాగ్రత్త! ఓ 22ఏళ్ల వ్యక్తి 10నిమిషాల్లో ఒకటిన్నర లీటరు కూల్​డ్రింక్​ తాగి ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. ఆసుపత్రిలో చేరిన 18 గంటలకు.. చికిత్స పొందుతూ మరణించాడు.

coca cola
కోకాకోలా
author img

By

Published : Sep 27, 2021, 5:37 PM IST

చైనా రాజధాని బీజింగ్​కు చెందిన ఓ వ్యక్తి 10 నిమిషాల వ్యవధిలో ఒకటిన్నర లీటర్ల కూల్​డ్రింక్​ తాగాడు. ఆ తర్వాతే అసలు సమస్య మొదలైంది. తీవ్రమైన కడుపు నొప్పితో గంటల వ్యవధిలోనే బీజింగ్​లోని చాయంగ్​ ఆసుపత్రిలో చేరాడు. 18 గంటల పాటు మృత్యువుతో పోరాడిన ఆ 22ఏళ్ల వ్యక్తి చివరకు ప్రాణాలు విడిచాడు.

అలా 10 నిమిషాల్లో అన్ని లీటర్ల కూల్​డ్రింక్​ తీసుకోవడం వల్ల శరీరంలో గ్యాస్​ అమాంతం పెరిగిపోయి కాలేయానికి ఆక్సిజన్​ అందకపోవడమే.. అతడి మరణానికి కారణమని వైద్యులు భావిస్తున్నారు. "22ఏళ్ల వ్యక్తికి బీపీ ఒక్కసారిగా పడిపోయింది. గుండె వేగంగా కొట్టుకుంది. ఊపిరి తీసుకోవడం కష్టమైంది. అతడు బతికున్నప్పుడు చేసిన సీటీ స్కాన్​లో కొన్ని విషయాలు బయటపడ్డాయి. పేగుల్లో గ్యాస్​ పేరుకుపోయింది. అక్కడి నుంచి కాలేయంలోని పోర్టల్​ వెయిన్​(జీర్ణాశయ సిర)కు గ్యాస్​ చేరింది. అందువల్ల ఆ ప్రాంతంలో ఆక్సిజన్​ స్థాయిలు ఒక్కసారిగా పడిపోయాయి. చివరకు అతడు ప్రాణాలు కోల్పోయాడు" అని వైద్యులు తమ నివేదికలో వెల్లడించారు.

అంతకుముందు వరకు ఆ వ్యక్తికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకపోవడం గమనార్హం.

కారణం అదేనా?

చైనా వైద్యులు చెబుతున్న విషయాన్ని బ్రిటన్​ వైద్యులు నమ్మలేకపోతున్నారు. కూల్​డ్రింక్​ తాగినంత మాత్రాన చనిపోతారా? అని అనుమానిస్తున్నారు. ఈ విషయంలో ఒక నిర్ణయానికి రావాలంటే వైద్యులు మరింత సమాచారాన్ని బయటపెట్టాలని అంటున్నారు లండన్​ యూనివర్సిటీలో బయోకెమిస్ట్​, ప్రొఫెసర్​ నాథన్​ డేవిస్​. 'ఒకటిన్నర లీటరు సాఫ్ట్​ డ్రింక్​ తాగి మరణించాడంటే నమ్మశక్యంగా లేదు. ఇలా జరగడం దాదాపు అసంభవం. అతడి మరణానికి బ్యాక్టీరియల్​ ఇన్​ఫెక్షన్​ కారణమై ఉంటుందన్నది నా అనుమానం. సాధారణంగా.. శరీరం లోపల గ్యాస్​ ఏర్పడటానికి అదే కారణం' అని వివరించారు.

ఇదీ చూడండి:- భారీగా తగ్గిన ఆయుర్దాయం- రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇప్పుడే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.