Malaysia Earthquake: మలేసియాలో భారీ భూకంపం సంభవించింది. ఆ దేశ రాజధాని కౌలాలంపూర్ సమీపాన ఏర్పడిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. నగరానికి నైరుతి దిక్కున 504 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు అధికారులు. ఆదివారం అర్ధరాత్రి సుమారు 2.40 గంటలకు జరిగిన ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. భవనాల నుంచి బయటకు వచ్చి రోడ్లపైకి పరుగులు తీశారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
6.4 తీవ్రతతో..
ఫిలిప్పీన్స్‌లో కూడా భారీ భూకంపం సంభవించింది. మనీలా నగరానికి 157 కిలోమీటర్ల దూరంలో జరిగిన ఈ ఘటనలో భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.4గా నమోదైంది. ఈ విషయాన్ని ఆ దేశానికి చెందిన నేషనల్ సెంటర్ ఫర్ సెసిమాలజీ వెల్లడించింది.
మరో భూకంపం..
ఇండోనేసియాలో 6.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. పరియామన్ నగరానికి 169 కిలోమీటర్ల దూరంలో 16 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని అధికారులు గుర్తించారు. సముద్రంలో ఏర్పడిన ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపారు. సునామీ వచ్చే ప్రమాదం కూడా లేదని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: పొలాండ్ సరిహద్దుల్లో రష్యా దాడి.. 35 మంది మృతి!