ETV Bharat / international

నేపాల్​- చైనా మధ్య కీలక వాణిజ్య మార్గం పునఃప్రారంభం - రాసువాగధి-కెరుంగ్​ రవాణా పాయింట్​

కరోనా కారణంగా నేపాల్​- చైనా మధ్య మూతపడిన కీలక వాణిజ్య మార్గం ఎనిమిది నెలల తర్వాత తిరిగి తెరుచుకుంది. సరిహద్దులోని రాసువాగధి- కెరుంగ్​ రవాణా పాయింట్​ ద్వారా తక్కువ సంఖ్యలో కార్గో వాహనాలకు అనుమతించింది చైనా. ఈ క్రమంలో బుధ, గురువారాల్లో పలు వాహనాలు నేపాల్​ చేరుకున్నాయి.

trading route between Nepal, China
నేపాల్​-చైనా మధ్య కీలక వాణిజ్య మార్గం పునఃప్రారంభం
author img

By

Published : Sep 24, 2020, 7:54 PM IST

కరోనా మహమ్మారి కారణంగా నేపాల్​, చైనా మధ్య మూసివేసిన కీలక వాణిజ్య మార్గం తిరిగి ప్రారంభమైంది. ఎనిమిది నెలల తర్వాత చైనాలోని టిబెట్​, నేపాల్​ మధ్య వస్తువుల రవాణాకు అనుమతించారు అధికారులు. ఇరు దేశాల సరిహద్దులోని రాసువాగధి- కెరుంగ్​ రవాణా పాయింట్​ను ప్రారంభించేందుకు కొన్ని షరతులతో చైనా అధికారులు అంగీకరించారు. పరిశ్రమలు, వాణిజ్య, సరఫరాల మంత్రిత్వ శాఖ నియమాలకు లోబడి తక్కువ సంఖ్యలో కార్గో వాహనాలను అనుమతించారు. ఈ క్రమంలో కొన్ని కార్గో వాహనాలు చైనా ఉత్పత్తులతో బుధ, గురువారాల్లో నేపాల్​ చేరుకున్నాయి.

నేపాల్​- చైనా సరిహద్దులోని రాసువాగధి-కెరుంగ్​, టాటోపాని-ఖాసా సరిహద్దు ప్రాంతాలను ఈ ఏడాది జనవరిలో మూసివేశారు. 2019 చివర్లో చైనాలోని వూహాన్​ నగరంలో తొలిసారి కరోనాను గుర్తించిన క్రమంలో వైరస్​ను కట్టిడి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇన్నాళ్లు కొన్ని రోజుల పాటు మెడికల్​ కిట్లు వంటి అత్యవసర వస్తువులను తరలించే వాహనాల రవాణాకు సరిహద్దు పాయింట్లను తెరిచారు.

ఉపరితల వాణిజ్య మార్గాలను పూర్తిస్థాయిలో తెరిచేందుకు శుక్రవారం ఇరు దేశాల ప్రతినిధులు వర్చువల్​గా సమావేశం కానున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. ఈ భేటీలో టాటోపానీ-ఖాసా సరిహద్దు పాయింట్​ తెరవటం పై ప్రధానంగా చర్చించనున్నారు.

ఇదీ చూడండి: 'రైతుల తర్వాత ఈసారి కార్మికులపై దోపిడి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.