ETV Bharat / international

Viral​: అతడి కెమెరా ట్రిక్కుతో ప్రపంచం తలకిందులు! - వైరల్ న్యూస్​

కేరళకు చెందిన ఓ వ్యక్తి ఫొటోగ్రఫీలో సత్తా చాటాడు. ఒరంగటాన్​ చెట్టును పట్టుకున్న చిత్రాన్ని అద్భుతంగా బంధించాడు. అయితే ఈ ఫొటోను నిశితంగా గమనిస్తే.. ప్రపంచం తలకిందులైనట్లుగా కనిపిస్తుంది. దీని కోసం ఆ వ్యక్తి చాలా రోజులే శ్రమించాడు. ఫలితంగా నేచర్​ ఫొటోగ్రఫీ పోటీల్లో ప్రథమ బహుమతి దక్కించుకున్నాడు. సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారిన ఈ ఫొటో వెనుక కథెంటో చూద్దాం.

kerala mans photo of an orangutan clinging to a tree wins first prize
Viral​: ప్రపంచాన్ని తలకిందులు చేసిన ఫొటోగ్రాఫర్​
author img

By

Published : Jun 7, 2021, 3:20 PM IST

కేరళకు చెందిన థామస్ విజయన్.. నేచర్ ఫొటగ్రఫీలో అద్భుత ప్రతిభ కనబరిచాడు. అత్యంత అరుదైన ఒరంగటాన్​ను తన కెమెరాలో బంధించాడు. ఈ ఫొటోను సరిగ్గా గమనిస్తే తలకిందులుగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ ఎఫెక్ట్ రావడానికి విజయన్ చాలా రోజులే శ్రమించాడు. ఒరంటగాన్​లు అరుదుగా ఉండె బోర్నియో ఐలాండ్ వెళ్లాడు. తన మదిలో ఉన్న ఫ్రేమ్ వచ్చే వరకు వేచి చూశాడు. చివరకు అనుకున్నది సాధించాడు.

విజయన్​ బంధించిన ఈ చిత్రం టీటీఎల్ నేచర్ ఫొటోగ్రఫీ-2021 పోటీల్లో ప్రథమ బహుమతి సాధించింది. అతడికి బహుమతిగా 1,500 పౌండ్లు(రూ.1,50,000) దక్కాయి. మొత్తం 8,000 మంది ఫొటోగ్రాఫర్లు పాల్గొన్న ఈ పోటీలో తాను గెలిచినందుకు విజయన్ ఆనందం వ్యక్తం చేశాడు. అంతరించిపోతున్న ఒరంగటాన్​ జాతిని కాపాడాలని ప్రపంచానికి సందేశం ఇచ్చేందుకు తను ఈ ఫొటోను చిత్రీకరించినట్లు చెప్పాడు.

kerala mans photo of an orangutan clinging to a tree wins first prize
Viral​: ప్రపంచాన్ని తలకిందులు చేసిన ఫొటోగ్రాఫర్​

"ఈ షాట్ కోసం నీటిలో ఉన్న ఒక చెట్టును ఎంచుకున్నాను. దాని వల్ల ఆకాశం, చెట్ల ఆకుల ప్రతిబింబం కనిపిస్తుంది. ఫలితంగా అద్దం ఎఫెక్ట్​ ఏర్పుడుతుంది. ఫొటో తలకిందులుగా కనిపిస్తుంది . ఈ ఫ్రేమ్ సెట్ చేసుకున్నాక నేను చెట్టుపైకి ఎక్కి గంటల కొద్దీ నిరీక్షించాను. చివరకు అనుకున్న విధంగా ఒరంగటాన్ ఫొటోను బంధించాను." అని విజయన్ అన్నాడు. తన శ్రమకు తగ్గ ఫలితం దక్కినందుకు ఆనందం వ్యక్తం చేశాడు. ఈ ఫొటోకు 'ద వరల్డ్ ఈస్ గోయింగ్ అప్​సైడ్ డౌన్' అని క్యాప్షన్ పెట్టాడు.

విజయ్ తీసిన ఈ ఫొటోకు సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు ఫిదా అయ్యారు.

ఈ కాంపిటీషన్​లో పాల్గొన్న 13 ఏళ్ల బ్రిటన్​ బాలుడికి యంగ్ నేచర్ ఫొటోగ్రాఫర్-2021 అవార్డు దక్కింది. పక్షులపై అతడు తీసిన ఫొటో విశేషంగా ఆకట్టుకుంది.

young photographer
నేచర్​ యంగ్ ఫొటోగ్రాఫర్​

ఈ పోటీల్లో కెమెరా ట్రాపింగ్ విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచిన ఫొటో

camera trap category
కెమెరా ట్రాప్​

అండర్​వాటర్ విభాగంలో మొదటి స్థానం సాధించిన ఫొటో

under water category
అండర్​వాటర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.