సంప్రదాయ రంగుల పండుగ హోలీని పాకిస్థానీ హిందువులు ఘనంగా జరుపుకున్నారు. కరాచీలోని హిందూ దేవాలయం స్వామి నారాయణ మందిర్లో హోలీ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో మత సామరస్యం వెల్లివిరిసింది. స్థానిక ముస్లింలు హోలీ వేడుకల్లో పాల్గొన్నారు.
చెడుపై మంచి విజయం సాధించడానికి గుర్తుగా హోలికా దహనం నిర్వహించారు. అందరికీ మిఠాయిలు పంచారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఆనందంగా పండుగ చేసుకున్నారు.