అత్యధిక సార్లు ఎవరెస్ట్ శిఖరం అధిరోహించి రికార్డు నెలకొల్పాడు నేపాల్‌కు చెందిన కమీ రీటా షెర్పా. గతేడాది 22వ సారి ఎవరెస్ట్ ఎక్కి రికార్డు సాధించిన షెర్పా... 23వసారీ అధిరోహించి తన రికార్డును తానే బదలుకొట్టాడు. 49 ఏళ్ల కమీ... ఇతర షెర్పాలతో కలిసి 8,850 మీటర్లు ఎత్తైన శిఖరాన్ని అధిరోహించాడు.
"నేపాల్‌లోని సొలుఖుంబు జిల్లాలోని థేమ్ గ్రామస్థుడు కమీ రిటా షెర్పా. బుధవారం ఉదయం 7.50గంటలకు విజయవంతంగా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాడు. నేపాల్ వైపునుంచి అధిరోహించిన షెర్పా.. ఎవరెస్ట్ అత్యధికసార్లు అధిరోహించిన వ్యక్తిగా తన రికార్డు తానే అధిగమించాడు."
-మింగ్మా షెర్పా, సెవన్ సమ్మిట్ ట్రెక్స్ సంస్థ అధినేత
1994 నుంచే...
-
The Legendary Everest Summitter Respected Dai Mr. Kami Rita Sherpa has successfully came to break his own record for 23rd time Mt. Everest (8848m) summit on 15th of May 2019 in morning 7:50 am. Huge respect to his dedication, hard work and success. 👏👏👏🙏🙏🏔️🇳🇵 pic.twitter.com/R9SfbR1sTJ
— Poornima Shrestha (@poornimashresth) May 15, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">The Legendary Everest Summitter Respected Dai Mr. Kami Rita Sherpa has successfully came to break his own record for 23rd time Mt. Everest (8848m) summit on 15th of May 2019 in morning 7:50 am. Huge respect to his dedication, hard work and success. 👏👏👏🙏🙏🏔️🇳🇵 pic.twitter.com/R9SfbR1sTJ
— Poornima Shrestha (@poornimashresth) May 15, 2019The Legendary Everest Summitter Respected Dai Mr. Kami Rita Sherpa has successfully came to break his own record for 23rd time Mt. Everest (8848m) summit on 15th of May 2019 in morning 7:50 am. Huge respect to his dedication, hard work and success. 👏👏👏🙏🙏🏔️🇳🇵 pic.twitter.com/R9SfbR1sTJ
— Poornima Shrestha (@poornimashresth) May 15, 2019
రీటా 1994 నుంచి ఎవరెస్ట్ అధిరోహిస్తున్నాడు. 1995లో ఒకసారి తన సహచరుడి ఆరోగ్యం సహకరించకపోవటం వల్ల విఫలమయ్యాడు. అదే ఏడాది మరోసారి ప్రయత్నించాడు. ప్రాణాంతక పెను హిమపాతం కొందరు యాత్రికుల ప్రాణాలు హరించటం మూలంగా ఎవరెస్ట్ అధిరోహణ విరమించుకున్నాడు.
అపా షెర్పా, ఫుర్బా షెర్పాల రికార్డు సమంచేస్తూ... 2017లో 21సార్లు ఎవరెస్ట్ అధిరోహించిన మూడో వ్యక్తిగా రికార్డు సాధించిన కమీ. 2018, 2019లో తన రికార్డును తానే తిరగరాసుకున్నాడు.