ETV Bharat / international

చెర్రీ పూల వసంతం- జపాన్​కు కొత్త సోయగం

వసంతకాలం అందాలు ఈసారి కాస్త మందుగానే జపాన్​ వాసులను పలకరించాయి. చెర్రీ పూలతో టోక్యో నగర వీధులు.. పూల పందిర్లను తలపిస్తున్నాయి. వీటిని చూస్తూ అక్కడి ప్రజలు పరవశించిపోతున్నారు.

cherry blossoms
చెర్రీ పూల వసంతం- జపాన్​కు కొత్త సోయగం
author img

By

Published : Mar 31, 2021, 10:01 AM IST

జపాన్​ వాసులను చెర్రీ పూల సోయగాలు మైమరిపింపజేస్తున్నాయి. టోక్యోలోని మెగురో నది వెంబడి ఈ సుందర దృశ్యాలను చూసేందుకు సందర్శకులు తరలివస్తున్నారు. గత వారమే టోక్యోలో అత్యవసర పరిస్థితిని ఎత్తివేయగా అక్కడ సందడి నెలకొంది. అయితే.. ఈ చెర్రీ చెట్ల కింద పిక్నిక్​ పార్టీలు జరుపుకోవడాన్ని జపాన్​ ప్రభుత్వం నిషేధించింది.

జపాన్​లో చెర్రీ పూల వసంతం

జపాన్​లో 'సకురా' అనే పూలు ప్రతి ఏడాది ఏప్రిల్​ నెలలో వికసిస్తాయి. దాంతో జపాన్​లో వసంతకాలం ప్రారంభమైందని భావిస్తారు. పాఠశాలలు, నూతన వాణిజ్య సంవత్సరం ఇదే నెలలో ప్రారంభమవుతాయి. అయితే.. 70 ఏళ్లలో తొలిసారిగా ఈ సారి ఏప్రిల్​ కంటే ముందుగానే ఈ పూలు వికసించాయని అధికారులు చెబుతున్నారు. వాతావరణ మార్పులే ఇందుకు కారణమని వివరిస్తున్నారు.

జపాన్​లోని పురాతన నగరం క్యోటోలో ఈసారి మార్చి 26నే ఈ పువ్వులు వికసించాయని అధికారులు చెప్పారు.

ఇదీ చూడండి:కొవిడ్ మూలాలు ఇంకా తేలలేదు: డబ్ల్యూహెచ్​ఓ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.