ETV Bharat / international

క్యూ2లో 7.8 శాతం పతనమైన జపాన్ జీడీపీ

జపాన్ ఆర్థిక వ్యవస్థపై కరోనా తీవ్ర ప్రభవం చూపింది. ఈ ఏడాది ఏప్రిల్​-జూన్ త్రైమాసికం(క్యూ2)లో తమ దేశ జీడీపీ రేటు 7.8 శాతం క్షీణించినట్లు జపాన్​ ప్రకటించింది.

Covid impact on Japan's economy
జపాన్​ ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం
author img

By

Published : Aug 17, 2020, 12:53 PM IST

కరోనా తెచ్చిన అనిశ్చితి జపాన్​ ఆర్థిక వ్యవస్థను తీవ్ర సంక్షోభంలోకి నెట్టింది. ఏప్రిల్​-జూన్​ త్రైమాసికంలో జపాన్ ఆర్థిక వ్యవస్థ వార్షిక రేటులో 27.8 శాతానికి క్షీణించింది. ఈ మూడు నెలల కాలంలో వినియోగం, వాణిజ్యం భారీగా తగ్గడం ఇందుకు కారణంగా పేర్కొంది జపాన్​.

ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో జపాన్​ ఎగమతులు వార్షిక రేటులో 56 శాతం, ప్రైవేటు వినియోగం దాదాపు 29 శాతం తగ్గినట్లు జపాన్​ వెల్లడించింది.

ఈ ఏడాది రెండో​ త్రైమాసికంలో సర్దుబాటు చేసిన స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ) రేటు 7.8 శాతానికి పడిపోయినట్లు జపాన్​ ప్రభుత్వం వెల్లడించింది.

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్ ఎదుర్కొన్న అత్యంత దారుణ పరిస్థితి ఇదేనని స్థానిక మీడియా కథనాలు చెబుతున్నాయి. 2008-09లో నెలకొన్న ప్రపంచ ఆర్థిక సంక్షోభం తర్వాతి స్థానంలో ఉంది.

ఇదీ చూడండి:'అలీబాబా' నిషేధానికి ట్రంప్​ ప్రభుత్వం కసరత్తు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.