ETV Bharat / international

అనారోగ్య కారణాలతో జపాన్​ ప్రధాని రాజీనామా - షింజో అబే రాజీనామా వార్తలు

అనారోగ్యం కారణంగా తన పదవీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు జపాన్‌ ప్రధాని షింజో అబే. ఈ మేరకు ఆయన శుక్రవారం అధికారిక ప్రకటన చేశారు. కొంతకాలంగా అల్సరేటివ్​ కొలిటిస్​ అనే పెద్దపేగు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు ఆయన వెల్లడించారు.

Japan PM Shinzo Abe says he's resigning for health reasons
అనారోగ్య కారణాలతో జపాన్​ ప్రధాని రాజీనామా
author img

By

Published : Aug 28, 2020, 4:33 PM IST

జపాన్​ను అత్యధిక కాలంగా పాలిస్తున్న ప్రధాని షింజో అబే.. తన పదవికి గుడ్​బై చెప్పేశారు. ఈ విషయంపై శుక్రవారం అనూహ్యంగా ప్రకటన చేసిన ఆయన.. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. అల్సరేటివ్​ కొలిటిస్​ అనే పెద్దపేగు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు ఆయన వెల్లడించారు.

"ప్రధాని పదవి నుంచి దిగిపోవాలని నేను నిర్ణయం తీసుకున్నాను. ఆత్మవిశ్వాసంతో ప్రజలను పాలించే స్థితిలో లేను. అందుకే ఇకపై ఆ పదవిలో కొనసాగకూడదని అనుకున్నాను. కరోనా వైరస్‌ క్లిష్టకాలంలో, పలు విధాన నిర్ణయాలు అమలు దశకు రాకముందే, ఏడాది పాటు పదవీకాలం మిగిలుండగానే.. రాజీనామా చేస్తున్నందుకు క్షమాపణలు కోరుతున్నాను"

-- షింజో అబే, జపాన్​ ప్రధాని

అబే పదవీ కాలం వచ్చే ఏడాది సెప్టెంబర్​ వరకు ఉంది. ఆయన ముందుగానే వైదొలగడం వల్ల పార్లమెంటు తదుపరి వారసుడుని ఎంపిక చేయనుంది. అప్పటివరకు అబే బాధ్యతలు నిర్వర్తించనున్నారు. మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న జపాన్‌కు తరువాతి ప్రధాని ఎవరని ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది.

2006లో బాధ్యతలు చేపట్టిన షింజో అబే.. జపాన్‌ చరిత్రలో అత్యంత ఎక్కువకాలం పనిచేసిన ప్రధానిగా పేరు పొందారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.