ETV Bharat / international

తొలి టీకా నేనే తీసుకుంటా: ఇజ్రాయెల్‌ ప్రధాని

కరోనా వ్యాక్సిన్​పై ప్రజలకు నమ్మకం కలిగించేందుకు ఇజ్రాయెల్​లో మొదటగా టీకా తానే తీసుకుంటానని అన్నారు ఆ దేశ ప్రధాని బెంజమిన్​ నెతన్యాహూ. తమ దేశ ప్రజలందరికీ వ్యాక్సిన్‌ అందించడమే తన ప్రథమ ప్రాధాన్యమని చెప్పారు. అమెరికా ఫార్మా కంపెనీ ఫైజర్ తయారు చేసిన​​ తొలివిడత టీకాలు ఆ దేశంలోకి చేరుకున్నాయి.

israel prime minister said he will takes the first covid vaccine in thier country
తొలి టీకా నేనే తీసుకుంటా:ఇజ్రాయెల్‌ ప్రధాని
author img

By

Published : Dec 9, 2020, 9:11 PM IST

కరోనా మహమ్మారిని అరికట్టే వ్యాక్సిన్‌పై ప్రజల్లో విశ్వాసం కలిగిచేందుకు తొలి టీకా తానే తీసుకుంటానని అంటున్నారు ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ. ఫైజర్‌ కొవిడ్‌ వ్యాక్సిన్‌ తొలి విడత టీకాలను ఇజ్రాయెల్‌ బుధవారం అందుకుంది. టెల్‌ అవివ్‌ సమీపంలోని ఎయిర్‌పోర్టులో ప్రత్యేక విమానంలో చేరుకున్న టీకాలను నెతన్యాహూ స్వయంగా వెళ్లి పరిశీలించారు. ఇజ్రాయెల్‌లో ఫైజర్‌ వ్యాక్సిన్‌ వినియోగానికి ఇంకా అక్కడి రెగ్యులేటరీలు అనుమతించలేదు. అతి త్వరలోనే ఈ అనుమతులు మంజూరు అవుతాయని నెతన్యాహూ విశ్వాసంగా ఉన్నారు.

"మహమ్మారి ముగింపు కనుచూపు మేరలో కన్పిస్తోంది. దేశ ప్రజలందరికీ వ్యాక్సిన్‌ అందించడమే నా ప్రథమ ప్రాధాన్యం. టీకా విషయంలో ప్రజలకు నేను ఉదాహరణలా నిలవాలనుకుంటున్నా. అందుకే దేశంలో వ్యాక్సిన్‌ పంపిణీ ప్రారంభంకాగానే తొలి టీకా నేను తీసుకోవాలనుకుంటున్నా. ఫైజర్‌ వ్యాక్సిన్‌ వినియోగానికి అనుమతులు మంజూరు అవుతాయని నమ్ముతున్నాను."

--బెంజమిన్‌ నెతన్యాహూ, ఇజ్రాయెల్‌ ప్రధాని.

israel prime minister said he will takes the first covid vaccine in thier country
టీకాను పరిశీలించడానికి విమానం వద్దకు వెళ్లిన ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్​ నెతన్యాహూ ప్రధాని

టీకా కోసం ఇప్పటికే ఫైజర్‌ సంస్థతో ఇజ్రాయెల్‌ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఆ సంస్థ నుంచి 80లక్షల డోసులకు ఆర్డర్‌ చేసింది. తొలి విడతలో భాగంగా లక్ష డోసులు నేడు ఇజ్రాయెల్‌కు చేరుకున్నాయి. దీంతో పాటు మరో అమెరికా బయోటెక్‌ సంస్థ మోడెర్నా నుంచి ఆరు లక్షల డోసుల కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. వచ్చే ఏడాది ఆ డోసులు డెలివరీ కానున్నాయి. ఇజ్రాయెల్‌లో 3లక్షల మందికి పైగా కరోనా బారిన పడ్డారు. బుధవారం నాటికి అక్కడ 2,932 మంది వైరస్‌కు బలయ్యారు.

జర్మనీకి చెందిన బయోఎన్‌టెక్‌తో కలిసి ఫైజర్‌ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి ఇప్పటికే బ్రిటన్‌ అనుమతులు మంజూరు చేసింది. మంగళవారం నుంచి అక్కడ టీకా పంపిణీ కార్యక్రమం చేపట్టారు. 90ఏళ్ల మార్గెరెట్‌ కీనన్‌ తొలి టీకా తీసుకున్నారు. అమెరికాలో త్వరలోనే ఫైజర్‌కు అనుమతులు లభించనున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి:'చైనా టీకా 86% సమర్థవంతం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.