హిందూ మహాసముద్రంలో ఇండోనేసియా నావికాదళానికి చెందిన జలాంతర్గామి గల్లంతైంది. బాలి ద్వీపానికి సమీపంలో సంబంధాలు తెగిపోయినట్లు ఆ దేశ ఆర్మీ వెల్లడించింది. జలాంతర్గామిలో 53 మంది సిబ్బంది ఉన్నట్లు తెలిపింది.
జలాంతర్గామి కేఆర్ఐ నంగలా 402 శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు తెలిపారు సైన్యాధినేత హాదీ జహ్జాంటో. రిపోర్టింగ్ సమయానికి ఆచూకీ గల్లంతైనట్లు చెప్పారు. బాలికి ఉత్తరాన 95 కిలోమీటర్ల దూరంలో సంబంధాలు తెగిపోయినట్లు ప్రకటించారు.
జలాంతర్గామి ఆచూకీ తెలుసుకునేందుకు సింగపూర్, ఆస్ట్రేలియా దేశాల కోరినట్లు తెలిపారు హాదీ. ఆయా దేశాల జలాంతర్గాముల రెస్క్కూ బృందాలు రంగంలోకి దిగినట్లు చెప్పారు