ETV Bharat / international

భారత్​ టీకాలపై చైనా ప్రశంసలు

author img

By

Published : Jan 10, 2021, 7:15 AM IST

భారత్ సామర్థ్యాన్ని అయిష్టంగానే అంగీకరించింది చైనా. తాము తయారు చేసిన టీకాలకు భారత్​ వ్యాక్సిన్లలు ఏ మాత్రం తీసిపోవని.. టీకాల తయారీలో భారత్​కు ప్రపంచంలోనే అత్యధిక ఉత్పాదన సామర్థ్యం ఉందని అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్​లో పేర్కొంది.

India's Coronavirus vaccines are good: China
భారత్​ టీకాలు మంచివే: చైనా

భారత్​ తయారు చేసిన కొవిడ్​-19 టీకాలకు విదేశాల్లో డిమాండ్​ పెరుగుతున్న నేపథ్యంలో.. చైనా అయిష్టంగానే మన సామర్థ్యాన్ని అంగీకరించింది. ఈ మేరకు ఆ దేశ అధికార పత్రిక 'గ్లోబల్​ టైమ్స్​'లో కథనం వచ్చింది.

"పరిశోధన, ఉత్పాదన సామర్థ్యం పరంగా చైనా తయారు చేసిన కొవిడ్​-19 టీకాలకు భారత్​ వ్యాక్సిన్లు ఏ మాత్రం తీసిపోవని నిపుణులు చెబుతున్నారు. టీకాల తయారీలో భారత్​కు ప్రపంచంలోనే అత్యధిక ఉత్పాదన సామర్థ్యం ఉంది. అలాగే కార్మిక, ఇతర సౌకర్యాల ఖర్చులు కూడా అక్కడ తక్కువ" అని పేర్కొంది. ఈ కారణంగా.. టీకా ఎగుమతి చేయాలన్న భారత్​ ప్రణాళిక అంతర్జాతీయ మార్కెట్​కు సానుకూల పరిణామం అవుతుందని పేర్కొంది.

అయితే దీని వెనుక భారత్​కు రాజకీయ, ఆర్థిక ఉద్దేశాలు ఉండొచ్చని ఆరోపించింది. స్వదేశీ టీకాలను తన రాజకీయ బ్రాండ్​ను మెరుగుపరుచుకోవడానికి, అంతర్జాతీయంగా చైనా టీకాల ప్రాబల్యాన్ని తగ్గించడానికి భారత్ ఉపయోగించొచ్చని కూడా అనుమానాలు వ్యక్తం చేసింది. హైదరాబాద్​లోని భారత్​ బయోటెక్​ సంస్థను సందర్శించిన జిలిన్​ యూనివర్సిటీ స్కూల్​ ఆఫ్​ లైఫ్​ సైన్సెస్​ నిపుణుడు జియాంగ్​ చున్లాయ్​ చేసిన వ్యాఖ్యలను కూడా ఇందులో పేర్కొంది. డబ్ల్యూహెచ్ఓ వంటి సంస్థలతో భారత్ టీకా సంస్థలు మొదటే చేతులు కలిపాయని కూడా ఆయన తెలిపినట్లు వివరించింది. ప్రపంచ టీకాల సరఫరాలో భారత్​ వాటా 60 శాతమని, వాటి కోసం అనేక దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయని 'బీబీసీ' చేసిన వ్యాఖ్యనూ ప్రస్తావించింది.

ఇదీ చూడండి: 'వలంటీరు మృతికి టీకాతో సంబంధం లేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.