చైనాతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఆ దేశ సీనియర్ అధికారితో భేటీ అయ్యారు అక్కడి భారత రాయబారి విక్రమ్ మిస్రీ. ఇరు దేశాల మధ్య ధ్వైపాక్షిక సంబంధాలతో పాటు తూర్పు లద్దాఖ్‌లోని సరిహద్దు పరిస్థితులపైనా చర్చించారు.
సీపీసీ సెంట్రల్ కమిటీ విదేశీ వ్యవహారాల కమిషన్ కార్యాలయం డిప్యూటీ డైరెక్టర్ లియు జియాన్చావోతో మిస్రీ సమావేశం అయ్యారు. తూర్పు లద్దాఖ్‌లోని అన్ని ప్రాంతాల నుంచి బలగాలను ఉపసంహరించుకోవటంపై భారత్, చైనా మధ్య దౌత్య, సైనిక స్థాయి చర్చలు జరుగుతున్న వేళ ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఇరువురి మధ్య భేటీపై చైనాలోని దౌత్య కార్యాలయం ట్వీట్ చేసింది.
-
Ambassador @VikramMisri today met H.E. Liu Jianchao, Deputy Director of the Office of the CPC Central Committee Foreign Affairs Commission and briefed him on India’s stance vis-à-vis the situation on the borders in eastern Ladakh UT and overall bilateral relations. pic.twitter.com/191WpOC951
— India in China (@EOIBeijing) August 12, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Ambassador @VikramMisri today met H.E. Liu Jianchao, Deputy Director of the Office of the CPC Central Committee Foreign Affairs Commission and briefed him on India’s stance vis-à-vis the situation on the borders in eastern Ladakh UT and overall bilateral relations. pic.twitter.com/191WpOC951
— India in China (@EOIBeijing) August 12, 2020Ambassador @VikramMisri today met H.E. Liu Jianchao, Deputy Director of the Office of the CPC Central Committee Foreign Affairs Commission and briefed him on India’s stance vis-à-vis the situation on the borders in eastern Ladakh UT and overall bilateral relations. pic.twitter.com/191WpOC951
— India in China (@EOIBeijing) August 12, 2020
" భారత రాయబారి విక్రమ్ మిస్రీ ఈరోజు లియు జియాన్ చావోతో భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య పూర్తిస్థాయి ధ్వైపాక్షిక సంబంధాలతో పాటు తూర్పు లద్దాఖ్‌లో పరిస్థితులపై భారత వైఖని వివరించారు.
- భారత దౌత్య కార్యాలయం
తూర్పు లద్ధాఖ్లోని నియంత్రణ రేఖ వెంబడి ఇరుదేశాల బలగాల ఉపసంహరణ ప్రక్రియ ముందుకు వెళ్లటం లేదన్న వార్తల నేపథ్యంలో ఇరువురు భేటీ అయినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన సైనిక స్థాయి చర్చల్లో చైనా దళాలను పూర్తిగా ఉపసంహరించుకోవాలని, మే 5 నాటికి ముందున్న యాథాతథ స్థితిని పునరుద్ధరించాలని భారత్ పట్టుబట్టింది.
పలుమార్లు జరిగిన చర్చలతో గల్వాన్ లోయ, ఇతర ప్రాంతాల నుంచి బలగాలను చైనా ఉపసంహరించుకున్నప్పటికీ.. కీలక ఫింగర్ ఏరియాలైన పాంగోంగ్ త్సో, గోగ్రా, దేప్సాంగ్ల నుంచి వెనక్కి తగ్గలేదు.