ETV Bharat / international

ఎయిర్​ ఇండియా విమానం హైజాకర్ హతం.. పాయింట్​ బ్లాంక్​లో..

Indian Airlines hijacker: 1999లో కాఠ్​మాండూ నుంచి దిల్లీ వస్తున్న విమానాన్ని హైజాక్​ చేసిన వారిలో ఓ ఉగ్రవాది హత్యకు గురైనట్లు పాక్​ మీడియా తెలిపింది. గుర్తు తెలియని వ్యక్తులు మిస్త్రీ జహూర్ ఇబ్రహీంను పాయింట్​ బ్లాంక్​లో కాల్చి చంపినట్లు పేర్కొంది.

Indian Airlines hijacker
విమానాన్ని హైజాక్​ చేసిన ఉగ్రవాది హతం
author img

By

Published : Mar 9, 2022, 4:42 PM IST

Indian Airlines hijacker: 1999లో కాఠ్​మాండూ నుంచి దిల్లీకి వస్తున్న ఐసీ-814 విమానాన్ని హైజాక్​ చేసిన ఐదుగురిలో ఒకడైన మిస్త్రీ జహూర్ ఇబ్రహీం చనిపోయినట్లుగా పాక్​​ మీడియా తెలిపింది. మార్చి 1న పాకిస్థాన్​లోని కరాచీలో ఉండే అక్తర్​ కాలనీలో ఇబ్రహీంను గుర్తు తెలియని వ్యక్తులు పాయింట్​ బ్లాంక్​లో కాల్చి చంపినట్లు పేర్కొంది. సరిగ్గా తలపై రెండు సార్లు కాల్పులు జరిగినట్లు రాసుకొచ్చింది.

జైషే మహ్మద్​ తీవ్రవాద సంస్థకు చెందిన ఇబ్రహీం.. అనేక సంవత్సరాల పాటు కరాచీలోనే ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. నకిలీ గుర్తింపుతో ఉన్న అతనికి ఐఎస్​ఐ​ భద్రత కల్పించినట్లు పలుసార్లు ఆరోపణలు వచ్చాయి.

1999 డిసెంబర్​ 24న నేపాల్‌ కాఠ్​మాండూలోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రయాణిస్తున్న ఎయిర్​ బస్​ ఏ300ను ఇబ్రహీంతో పాటు మరో నలుగురు హైజాక్​ చేశారు. ఈ ఘటనలో హర్కత్ ఉల్ ముజాహిదీన్ అనే సంస్థ కూడా భాగమైనట్లు ఆరోపణలు వచ్చాయి. వీరంతా విమానం భారత గగనతలంలోకి ప్రవేశించిన కొద్దిసేపటికే హైజాక్ చేశారు.

ముష్తాక్ అహ్మద్ జర్గర్, అహ్మద్ ఒమర్ సయీద్ షేక్, మసూద్ అజార్ అనే ముగ్గురు ఉగ్రవాదులను విడుదల చేయడమే లక్ష్యంగా వీరు ప్లేన్​ హైజాక్​కు పాల్పడ్డారు. సుమారు ఏడు రోజుల పాటు ఈ హైజాక్​ డ్రామా కొనసాగగా.. ఆ ముగ్గురు ఉగ్రవాదులను విడుదల చేయడానికి ప్రభుత్వం అంగీకరించింది. హైజాక్ సమయంలో విమానంలో 15 మంది సిబ్బందితో పాటు 191 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే కత్తిపోటుకు ఒకరు చనిపోగా.. మరికొందరికి గాయాలయ్యాయి.

ఇదీ చూడండి:

పిట్టల్లా రాలుతున్న రష్యా విమానాలు.. ఆ క్షిపణులే కారణం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.