గతేడాది ఫిబ్రవరిలో భారత వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌ను పాకిస్థాన్ నిర్బంధించింది. ఆ సమయంలో పాక్ ఆర్మీ ఛీఫ్ ఖమర్ జావేద్ బాజ్వా.. తీవ్ర భయాందోళనకు గురయ్యారని పాకిస్థాన్ ముస్లిం లీగ్-ఎన్(పీఎమ్ఎల్-ఎన్)నేత అయాజ్ సాదిఖ్ అన్నారు.
అభినందన్‌ను వదిలిపెట్టకపోతే.. భారత్ తమ దేశంపై దాడి చేస్తుందని బాజ్వా వణికిపోయారని చెప్పారు. ఆ దేశ పార్లమెంట్ సమావేశంలో అయాజ్ సాదిఖ్ ఆనాటి సంఘటనను గుర్తు చేసుకున్నారు.
"ఆరోజు జరిగిన సమావేశం నాకు బాగా గుర్తుంది. పాక్ విదేశాంగ మంత్రి ఖురేషి.. పార్లమెంటరీ నేతలతో భేటీ అయ్యారు. ఈ కార్యక్రమానికి ఇమ్రాన్ ఖాన్ హాజరు కాలేదు. అభినందన్‌ను గనుక విడిచిపెట్టకపోతే.. రాత్రి 9 గంటలకల్లా పాకిస్థాన్‌పై భారత్ దాడి చేస్తుందని ఖురేషి హెచ్చరించారు. ఆ సమయంలో ఆర్మీ ఛీఫ్ బాజ్వా కాళ్లు వణకడం నేను గమనించాను. "
-- అయాజ్ సాదిఖ్, పాకిస్థాన్ ప్రతిపక్ష నేత.
2019,ఫిబ్రవరి 27న పాకిస్థాన్ యుద్ధవిమానం ఎఫ్-16 కూల్చివేయడంలో ధైర్య, సాహసాలు ప్రదర్శించారు భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్. అదేరోజు ఆయనను పాకిస్థాన్ నిర్బంధించింది. ఎట్టకేలకు 2019, మార్చి 1న తిరిగి స్వదేశానికి చేరుకున్నారు అభినందన్. రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రతిష్ఠాత్మక 'వీర్ చక్ర' పురస్కారాన్ని ఆయన అందుకున్నారు.
ఇదీ చూడండి:పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనల జ్వాల