ETV Bharat / international

'కరోనాపై తొలి నుంచీ భారత్​ స్పందన భేష్​'

author img

By

Published : Jul 22, 2020, 7:38 PM IST

కరోనా వైరస్​ కట్టడికి భారత్ పకడ్బందీగా చర్యలు చేపడుతోందని కితాబిచ్చారు ప్రపంచ ఆరోగ్య సంస్థ రీజినల్ డైరెక్టర్​(ఆగ్నేయ ఆసియా) పూనం ఖేత్రపాల్ సింగ్. ఇతర దేశాలతో పోల్చితే అధిక జనాభా గల భారత్​లో కరోనా వ్యాప్తి తక్కువగా ఉన్నట్లు చెప్పారు.

India responding with utmost urgency to COVID-19 from start: WHO
'కరోనా కట్టడికి భారత్​ చర్యలు భేష్​'

కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైన తొలినాళ్ల నుంచి భారత్​ చురుకుగా స్పందిస్తోందని చెప్పారు ప్రపంచ ఆరోగ్య సంస్థ రీజినల్ డైరెక్టర్​(ఆగ్నేయ ఆసియా) పూనం ఖేత్రపాల్ సింగ్. కరోనాపై పోరుకు అవసరమైన చర్యలను భారత్​ స్థిరంగా చేపడుతోందని కితాబిచ్చారు. దేశంలో కరోనా వ్యాప్తి మొదలైన వెంటనే వైద్య సదుపాయలు మెరుగుపరిచారని, వైరస్​పై​ పోరుకు సన్నద్ధమయ్యారని వర్చువల్ ర్యాలీలో వివరించారు.

" కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు భారత్​ సాహసోపేత నిర్ణయాలు తీసుకుంది. పరీక్షల సామర్థ్యాన్ని పెంచింది. అనేక ఆస్పత్రులను సిద్ధం చేసింది. ఔషధాలను, వైద్యపరికరాలను అందుబాటులో ఉంచింది. ఇతర దేశాలతో పోల్చితే భారీ స్థాయిలో కేసులు నమోదు కావడం లేదు. కొత్త కేసుల్లో పెద్దగా వ్యత్యాసం ఉండటంలేదు. వైరస్ వ్యాప్తి కూడా తక్కువగా ఉంది. ఎక్కువ జనసాంద్రత ఉన్న కొన్ని ప్రాంతాల్లో మాత్రమే అధిక కేసులు నమోదవుతున్నాయి. భారత్​ లాంటి అధిక జనాభా గల దేశంలో కరోనాను కట్టడి చేయడమంటే సాధారణ విషయం కాదు. ప్రభుత్వం మొదట్నుంచీ పకడ్బందీగా చర్యలు చేపడుతోంది."

- పూనం ఖేత్రపాల్ సింగ్, డబ్ల్యూహెచ్​ఓ రీజినల్ డైరెక్టర్​(ఆగ్నేయ ఆసియా)

ఇదీ చూడండి: నోబెల్​ వేడుకపైనా కరోనా ప్రభావం- విందు రద్దు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.