ETV Bharat / international

బలూచిస్థాన్​కు స్వతంత్రం సాధ్యమా?​ ఎప్పటికి?

1971లో పాకిస్థాన్​ నుంచి బంగ్లాదేశ్ విడిపోయి స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది. బంగ్లాదేశ్ పుట్టుకలో కీలకంగా వ్యవహరించింది భారత దేశమే. మరి పాకిస్థాన్​లో కొన్నేళ్లుగా మరో స్వతంత్ర దేశం కోసం పోరాటం సాగుతోంది. దీనికి భారత్ మద్దతు ఎంత వరకు ఉంది? అక్కడి నేతలు ఏమంటున్నారు?

author img

By

Published : Jul 14, 2020, 4:10 PM IST

India made compromise with Pakistan over Baloch cause, says Naela Quadri
'పాకిస్థాన్​తో భారత ప్రభుత్వం రాజీ పడింది'

సమయం దొరికినప్పుడల్లా భారత్​లో మానవహక్కల ఉల్లంఘన అంటూ గొంతు చించుకునే పాకిస్థాన్... ఆ విషయంలో తాను ఏం చేస్తోందనే విషయాన్ని విస్మరిస్తూ ఉంటుంది. పాక్ ఆక్రమిత కశ్మీర్​ నుంచి బలూచిస్థాన్ వరకు మైనారిటీలపై అకృత్యాలకు కేరాఫ్ అడ్రస్​గా నిలుస్తోంది. స్వతంత్రం కోసం పోరాడుతున్న బలూచిస్థాన్ ప్రజలను క్రూరంగా హింసిస్తోంది.

అయినప్పటికీ పట్టు వదలకుండా బలూచ్ ప్రజలు స్వతంత్రం కోసం పోరాడుతున్నారు. అంతర్జాతీయ వేదికలపై తమ గళాన్ని వినిపిస్తున్నారు. న్యూయార్క్, లండన్​లో తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. తమకు మద్దతివ్వాలని ప్రపంచ దేశాలను అభ్యర్థిస్తున్నారు.

అయితే వీరి పోరాటానికి అంతర్జాతీయంగా ఎంతవరకు మద్దతు లభిస్తోంది? భారత్​ వీరి పోరుకు సహకరిస్తోందా? బలూచ్ ప్రజల పట్ల ఐక్యరాజ్య సమితి వైఖరేంటి? అనే విషయాలపై బలూచిస్థాన్ ఉద్యమ​ కార్యకర్త, 'బలూచ్ పీపుల్స్ కాంగ్రెస్' ఛైర్​పర్సన్​ నాలా ఖాద్రీ బలూచ్ ఈటీవీ భారత్​తో ప్రత్యేకంగా మాట్లాడారు. బలూచిస్థాన్​లో పాకిస్థాన్ సాగిస్తున్న కుట్రలు, ప్రజల పోరాటం, స్వతంత్రం సాధించేందుకు చేస్తున్న పోరాటంపై పలు విషయాలు వెల్లడించారు.

ఉగ్రవాదులు కాదు స్వతంత్ర యోధులు

ఇటీవలే కరాచీ స్టాక్ ఎక్స్ఛేంజీపై బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో 10 మంది మరణించగా.. దీనికి బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ బాధ్యత ప్రకటించుకుంది. ఈ తిరుగుబాటు బృందం బలూచిస్థాన్ స్వతంత్రం కోసం కొన్నేళ్లుగా పోరాడుతోంది.

అయితే.. కొందరు ఈ తిరుగుబాటు బృందాన్ని ఉగ్రవాదులుగా అభివర్ణిస్తున్నారని, వీరు ఉగ్రవాదులు కారని, స్వతంత్ర సమరయోధులని నాలా ఖాద్రీ పేర్కొన్నారు. స్వతంత్రం కోసం పోరాడటం, ఉగ్ర కార్యకలాపాల్లో పాల్గొనటం మధ్య చాలా తేడా ఉందని అన్నారు.

నాలా ఖాద్రీతో ఈటీవీ భారత్ ముఖాముఖి

"స్వేచ్ఛ కోసం బలూచ్​ ప్రజలు సాగిస్తున్న పోరాటాన్ని అణచివేస్తున్నారు. బలూచ్ ప్రజల స్వరం వినిపించకుండా చేస్తున్నారు. ప్రపంచానికి తమ గళం వినిపించడానికి బలూచిస్థాన్​లోని యువత తమ ప్రాణాలను తీసుకుంటున్నారు. ప్రపంచం పూర్తిగా కపటమైనది. మా ఇళ్లను నాశనం చేసి, పిల్లలు, మహిళలను అపహరించే పాకిస్థాన్ సైనికులే నిజమైన ఉగ్రవాదులు."

-నాలా ఖాద్రీ

ముఖాముఖి సారాంశం

రాజకీయ మార్గాలు, రాజకీయ పోరాటం ద్వారా మీరు స్వేచ్ఛను సాధించగలరా?

రాజకీయ మద్దతు కోసమే మేము చాలా దేశాల తలుపు తట్టాం. రాజకీయ మార్గాలు లేకుండా మేం ఏదీ సాధించలేం. బలూచిస్థాన్ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న రాజకీయ పార్టీలు పాకిస్థాన్ ముస్లిం లీగ్​ కన్నా పాతవి. మా రాజకీయ ఉద్యమాలు వాటి పని అవి చేస్తున్నాయి. స్వేచ్ఛను సాధించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. కానీ మేము శాంతియుత రాజకీయ మార్గాన్నే నమ్ముతున్నాం.

మీ పోరాటాలపై ప్రపంచం ఎందుకు శీతకన్ను వేస్తోంది?

దేశాలు వారి ప్రయోజనాల కోసం పనిచేస్తాయి. ఐక్యరాజ్య సమితి తన నిధుల్లో ప్రధాన వాటా చైనా నుంచే పొందుతుంది. కాబట్టి మా సమస్యలను ఐరాస అర్థం చేసుకోవడం కష్టమవుతోంది. కొన్ని దేశాలకు అఫ్గానిస్థాన్​లో పాక్​ మద్దతు కావాలి. మరికొందరికి వాఘా సరిహద్దు, నియంత్రణ రేఖ వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదు. మేం ఏ దేశాన్ని పక్కనబెట్టడానికి ఇష్టపడటం లేదు. ప్రతి దేశం సార్వభౌమత్వాన్ని ఆస్వాదించాలనే కోరుకుంటున్నాం. బలూచిస్థాన్ అంటే ఖనిజాలు పుష్కలంగా ఉండే ప్రాంతం మాత్రమే కాదు. ఇది మా మాతృభూమి.

బలూచిస్థాన్​ స్వతంత్ర సంగ్రామానికి భారత్​ ఆజ్యం పోస్తోందని పాకిస్థాన్ ఆరోపణలు చేస్తోంది. ఈ ఆరోపణలపై మీరేమంటారు?

బలూచిస్థాన్ ఉద్యమాన్ని ఖండించడానికే ఈ వాదన చేస్తోంది. బలూచ్ ఉద్యమానికి మద్దతు ఇచ్చే విధంగా భారత్​లో రాజకీయ సంకల్పం లేదు. మా ఉద్యమానికి తమ ప్రభుత్వం మద్దతు ఇవ్వాలని భారతీయులు కోరుకుంటున్నారు. కానీ ఈ విషయంలో వారు ఓట్ల ద్వారా ప్రభుత్వాన్ని ఒప్పించలేకపోయారు. కాంగ్రెస్ అయినా భాజపా అయినా బలూచిస్థాన్ స్వేచ్ఛపై భారత ప్రభుత్వం పాకిస్థాన్​తో రాజీపడింది.

బలూచిస్థాన్​పై కనీసం ఐరాసలో భారత్ మద్దతివ్వాల్సింది. కానీ అది కూడా చేయడానికి ఇష్టపడదు. పాకిస్థాన్ సైన్యం మాపై దారుణాలకు పాల్పడినప్పుడు.. 'మీ మోదీని పిలవండి. మిమ్మల్ని రక్షించమని అడగండి' అని అంటారు. దాడి చేసే ముందు మమ్మల్ని హిందువులు అని పిలుస్తారు. ఒకవేళ కశ్మీర్ విషయాన్ని పాకిస్థాన్ లేవనెత్తినప్పుడు బలూచిస్థాన్ ఉద్యమాన్ని ఉపయోగించుకోవాలని భారత్ అనుకుంటోంది.

మిమ్మల్ని హిందువులని ఎవరు పిలుస్తారు?

మాపై అకృత్యాలకు పాల్పడే ముందు పాకిస్థాన్ సైనికులే మమ్మల్ని హిందువులని పిలుస్తారు. మా దగ్గర ఉన్న ఖురాన్​ను భగవద్గీత అని అనుకుంటారు. మా 'ఖురాన్​ ఏ పాక్​' వారి ఖురాన్​తో సమానమైనప్పటికీ... అది బలూచిస్థాన్ ప్రజల చేతిలో ఉంది కాబట్టి దాన్ని వేరుగా పరిగణిస్తారు. నిజానికి 'కల్మా'ను ఎలా చదవాలో వారిని నేర్పించిందీ మేమే.

కశ్మీరీల 'స్వేచ్ఛ' విషయంలో పాకిస్థాన్ ప్రమేయాన్ని మీరు ఎలా పరిగణిస్తారు?

పాకిస్థాన్​కు అసలు కశ్మీర్​తో సంబంధం లేదు. కశ్మీర్ గతంలోనూ పాక్​లో అంతర్భాగం కాదు. భవిష్యత్తులోనూ కాకూడదు. పాకిస్థాన్ ఒక కృత్రిమ దేశం. దక్షిణాసియాలో బ్రిటీష్ వారు ఒక ప్రతినిధిని ఉంచుకోవాలని భావించారు. ఆ తర్వాత అమెరికా వారికి సహాయం చేసింది. ఇప్పుడు చైనా ఆపన్నహస్తం అందిస్తోంది. బయటినుంచి మద్దతు లేకపోతే పాకిస్థాన్ తనకు తానుగా మనుగడ కూడా సాగించలేదు.

పాకిస్థాన్ వరకు ఉగ్రవాదం అనేది ఒక ఆస్తి. వీరంతా పాక్ ఆక్రమిత కశ్మీర్​లోని ప్రజలపై దురాగతాలకు పాల్పడుతున్నారు. ఐరాస ఒప్పందాలను ఉల్లంఘించి ఆ ప్రాంతంలో దళాలను మోహరించి, ఉగ్రవాదులకు ఆయుధాలు అందించి పీఓకేను పూర్తిగా సైనికీకరణ చేశారు.

బలూచ్ శిబిరంలోని వివిధ సమూహాల మధ్య చీలికల వల్ల ఉద్యమ మూల కారణం దెబ్బతింటోందా?

బలూచిస్థాన్​లో వైవిధ్యం ఉండటం మంచిదే. గాంధీజీ శాంతియుత ఉద్యమం నుంచి భగత్​ సింగ్​ సైనిక ఉద్యమం వరకు భారత స్వతంత్ర ఉద్యమం కూడా వైవిధ్యమైన ఆలోచనలు, సిద్ధాంతాలతో కొనసాగింది. ప్రతి స్వతంత్ర ఉద్యమంలో భిన్నమైన శిబిరాలు ఉంటాయి.

ఈ బృందాలన్నీ బలూచ్ నేషనల్ ఫ్రంట్​ అనే గొడుగు కిందకు వచ్చాయి. అలాంటి సమూహాలకు కూటమిగా బీఎన్​ఎఫ్ పనిచేసింది. చాలా మంది ప్రజలు ఇక్కడ తమ ప్రాణాలను కాపాడుకోవడానికే జీవిస్తున్నారు కాబట్టి మేము విడిపోయాము. అయినా ఒక కారణం కోసం ఐక్యంగా ఉన్నాం. అదే బలూచిస్థాన్​ స్వేచ్ఛ.

బలూచ్​ విషయంలో భారత్ ద్రోహం చేసిందా?

బలూచిస్థాన్ స్వేచ్ఛ గురించి మాట్లాడటం మినహా క్షేత్రస్థాయిలో జరిగింది చాలా తక్కువే. 2016లో ఎర్రకోటపై మోదీ ప్రసంగం తర్వాత మా అంచనాలు భారీగా పెరిగిపోయాయి. కానీ ఆ తర్వాత జరిగిందేమీ లేదు.

1948లో జవహర్​లాల్ నెహ్రూ సైతం బలూచ్ ప్రతినిధులను కలిశారు. భారత్​, పాకిస్థాన్ సైన్యాలు రెండు బ్రిటీష్ నియంత్రణలో ఉన్నాయి కాబట్టి మాకు నెహ్రూ మద్దతు ఇవ్వలేదు.

ఒకవేళ బలూచిస్థాన్ స్వతంత్రం సాధిస్తే రూపురేఖలు ఎలా ఉంటాయి?

బలూచిస్థాన్ ఎప్పుడూ భారత్​, ఇరాన్, అఫ్గానిస్థాన్​ దేశాల్లో భాగం కాదు. బలూచిస్థాన్ సార్వభౌమ దేశంగా రూపొందుతుంది. నాగరికతకు బలూచిస్థాన్ పెట్టింది పేరు. కేరళ, శ్రీలంక, అఫ్గానిస్థాన్​ ప్రాంతాలకు మా నాగరికత విస్తరించింది.

దక్షిణాసియా దేశాలన్నీ కలిసి సంయుక్త రాష్ట్రాలుగా ఏర్పడాలి. ఇదో అవకాశం ఉంది. ఈ ప్రాంతానికి ఒకే కరెన్సీ, ఒకే రక్షణ వ్యవస్థ, భారీ మూలధనం ఉంటుంది. ఇందులో బలూచిస్థాన్​ కూడా భాగస్వామ్యం అవుతుంది. కానీ ఎప్పటికీ తన భూమిని, సంస్కృతిని, గుర్తింపును త్యాగం చేయదు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.