ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు కలిసి పనిచేయాలని భారత్-ఇండోనేషియా నిర్ణయించాయి. ఆసియాన్ సదస్సులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ... ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడొడొతో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక అంశాలపై ఇరు నేతలు చర్చలు జరిపారు.
సముద్రతీరంలో పొరుగుదేశాలైన భారత్-ఇండోనేషియా....ఇండో-పసిఫిక్ రీజియన్‌లో శాంతి భద్రతలు, శ్రేయస్సు కోసం కలిసి పనిచేయాలని నిర్ణయించినట్లు విదేశాంగ శాఖ పేర్కొంది. రక్షణ, భద్రత, వాణిజ్యం, పెట్టుబడుల అంశాల్లో ఇండోనేషియాతో సంబంధాలు బలోపేతం చేసుకునేందుకు భారత్ కట్టుబడి ఉన్నట్లు తెలిపింది. ఇండోనేషియాతో ద్వైపాక్షిక వాణిజ్యం పెంచుకోవడం, ఫార్మా, ఆటోమోటివ్, వ్యవసాయ ఉత్పత్తులు సహా భారత్ వస్తువులకు మార్కెట్ అవకాశాలపై మోదీ ప్రధానంగా దృష్టి సారించినట్లు విదేశాంగ శాఖ వివరించింది.
ఇదీ చూడండి: 'స్పైవేర్ గురించి ప్రభుత్వాన్ని ముందే అప్రమత్తం చేశాం'