ETV Bharat / international

భారత్‌-చైనా ఘర్షణపై విదేశీ మీడియా ఏమందంటే.. - భారత్​ చైనా ఘర్షణ

లద్దాఖ్‌లోని గాల్వాన్‌ లోయలో భారత్​-చైనా సైనికులు ఘర్షణ పడగా.. ఇరు దేశాలకు చెందిన కొంత మంది సైనికులు మరణించారు. రెండు దేశాల మధ్య దశాబ్దాలు తర్వాత ఈ స్థాయిలో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ప్రపంచ దేశాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. పలు అంతర్జాతీయ పత్రికలు, మీడియా సంస్థలు సైతం ఈ పరిణామాలను ప్రముఖంగా ప్రచురించాయి. అంతర్జాతీయ పత్రికలు ఏవిధంగా స్పందించాయో తెలుసుకుందాం!

inationalinternational latestnews How-foreign-media-reacted-to-India-China-faceoff
భారత్‌-చైనా ఘర్షణపై విదేశీ మీడియా ఏమందంటే..
author img

By

Published : Jun 17, 2020, 12:31 PM IST

దాదాపు నాలుగున్నర దశాబ్దాల తర్వాత భారత్‌-చైనా సరిహద్దుల్లో నెత్తురు చిందింది. లద్దాఖ్‌లోని గాల్వాన్‌ లోయలో గత ఆరు వారాలుగా నెలకొన్న ఘర్షణలు చివరకు ప్రాణనష్టానికి దారితీశాయి. భారత్‌ వైపు 20 మంది సైనికులు వీరమరణం పొందారు. చైనా సైతం 43 మంది కోల్పోయినట్లు సమాచారం. రెండు అణ్వాయుధ దేశాల మధ్య దశాబ్దాల తర్వాత ఈ స్థాయిలో ఉద్రిక్తతలు చోటుచేసుకోవడంపై ప్రపంచ దేశాలు దృష్టి సారించాయి. పరిస్థితులు చేదాటితే పరిణామాలు తీవ్రంగా ఉండే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాయి. పలు అంతర్జాతీయ పత్రికలు, మీడియా సంస్థలు సైతం ఈ పరిణామాలను ప్రముఖంగా ప్రచురించాయి. పరిస్థితులు మరింత దిగజారితే తలెత్తే పరిణామాలను విశ్లేషించాయి.

నిప్పు రాజేసిన చైనా..: న్యూయార్క్‌ టైమ్స్‌

"ఇటీవల చైనా యుద్ధ వాహనాలు, ఆయుధ సామగ్రి, ట్రక్కులు, సైనికులను సరిహద్దు వెంట మోహరించింది. డ్రాగన్‌ తీసుకున్న ఈ నిర్ణయంతో దశాబ్దాలుగా నెలకొన్న ఉద్రిక్తతల్లో చైనా నిప్పు రాజేసినట్లైంది. తదనంతర పరిణామాల్లో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌, భారత ప్రధాని మోదీ దృఢమైన నిర్ణయాలు తీసుకున్నారు. దీంతో పరిస్థితులు చేదాటిపోయే ప్రమాదం ఉంది" అని అమెరికా ప్రముఖ పత్రిక న్యూయార్క్‌ టైమ్స్‌ పేర్కొంది.

గతంలో చర్చలతోనే సద్దుమణిగాయి, కానీ..: వాషింగ్టన్‌ పోస్ట్‌

"1962 యుద్ధం మినహా తరచూ భారత్‌-చైనా మధ్య తలెత్తే వివాదాలు చర్చల ద్వారా పరిష్కారమయ్యేవి. కానీ, ఇటీవల రెండు దేశాల సరిహద్దులో నెలకొన్న ప్రతిష్టంభన తీవ్ర ఘర్షణకు దారితీసింది. దీంతో అనేక మంది తీవ్ర గాయాలపాలయ్యారు" అంటూ ఎలాంటి విశ్లేషణను జోడించుకుండా వాషింగ్టన్‌ పోస్ట్‌ జరిగిన ఘటనను ప్రచురించింది.

నాలుగు దశాబ్దాల్లో ఒక్క తూటా పేలలేదు..: బీబీసీ

'ఇండియా-చైనా క్లాష్‌: యన్‌ ఎక్స్‌ట్రార్డినరీ ఎస్కలేషన్‌ విత్‌ రాక్స్‌ అండ్‌ క్లబ్స్‌' పేరిట బీబీసీ కథనం ప్రచురించింది. రెండు అణ్వాయుధ దేశాల మధ్య దశాబ్దాలుగా సరిహద్దు వివాదాలు కొనసాగుతున్నాయి. ఇరు దేశాలు వాస్తవాధీన రేఖ వెంట అనేక ప్రాంతాల్లో గస్తీ కాస్తూ ఒకరి భూభాగంలోకి ఒకరు దూసుకెళ్లారు. దీంతో అనేక సార్లు ఘర్షణలు చోటుచేసుకున్నాయి. కానీ, నాలుగు దశాబ్దాల్లో ఒక్క తూటా పేలలేదు. ఈ నేపథ్యంలో తాజాగా చోటుచేసుకున్న ఉద్రిక్తతలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి" అని బీబీసీ పేర్కొంది.

విస్తరణ కాంక్ష ప్రమాదకరం..: ది గార్డియన్‌

"ప్రపంచంలో అత్యంత ఉద్రిక్త ప్రాంతంగా ఉన్న భారత్‌-చైనా సరిహద్దుల్లో దళాలు కర్రలు, ఇనుపరాడ్లతో ఘర్షణకు దిగాయి. రెండూ అణ్వాయుధ దేశాలు కావడం గమనార్హం. ఈ పరిణామాలు విస్తరణ కాంక్ష వల్ల తలెత్తే ప్రమాదాన్ని ఎత్తిచూపుతున్నాయి" అంటూ పరోక్షంగా పొరుగు దేశాల భూభాగాల ఆక్రమణకు యత్నిస్తున్న చైనా విస్తరణ కాంక్షను 'ది గార్డియన్' పత్రిక చురకలంటింది.

ఇదీ చూడండి:సరిహద్దు ఘర్షణపై రాజ్​నాథ్ అత్యవసర సమావేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.