పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)లోని గిల్గిత్ బాల్టిస్థాన్ రాజకీయ స్థితిని మార్చాలనే పాకిస్థాన్ ప్రయత్నాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి. అయితే.. ఈ నిరసనల మధ్యే ఆ ప్రాంతానికి తాత్కాలిక రాష్ట్ర హోదా కల్పిపిస్తున్నట్లు ప్రకటించింది పాకిస్థాన్ ప్రభుత్వం.
ఆందోళనల నడుమ.. గిల్గిత్ బాల్టిస్థాన్లో ఆదివారం పర్యటించిన ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఈ మేరకు ప్రకటన చేసినట్లు జియో న్యూస్ వెల్లడించింది.
" గిల్గిత్ బాల్టిస్థాన్కు తాత్కాలిక రాష్ట్ర హోదా కల్పించాలని నిర్ణయించిట్లు ప్రకటించటం కూడా ఇక్కడకు రావటానికి గల కారణాల్లో ఒకటి."
- ఇమ్రాన్ ఖాన్, పాకిస్థాన్ ప్రధాని.
పాక్ ఆక్రమిత కశ్మీర్, గిల్గిత్ బాల్టిస్థాన్ను పాకిస్థాన్ మ్యాప్ నుంచి సౌదీ అరేబియా తొలగించిన కొద్ది రోజుల్లోనే ఈ మేరకు ఇమ్రాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం ప్రాధాన్యం సంతరించుకుంది. అలాగే.. తాజా నిర్ణయం ఆ ప్రాంతంలో ఉద్రిత్త లను పెంచే అవకాశం ఉంది.
ఇదీ చూడండి: పాకిస్థాన్ బరితెగింపు- గిల్గిత్పై కొత్త కుట్ర