ETV Bharat / international

కశ్మీర్​లో చొరబాట్లపై ఇమ్రాన్​ ఖాన్​ బుకాయింపు! - కశ్మీర్​పై ఇమ్రాన్​ ఖాన్ వ్యాఖ్యలు

కశ్మీర్​లో చొరబాట్లపై పాక్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ తప్పించుకునే ప్రయత్నం చేశారు. పాక్​కు వ్యతిరేకంగా భారత్​ కావాలని కుట్ర పన్నుతోందని ఆరోపించారు. కశ్మీర్​లోని అంతర్గత హింసను పాక్​కు అంటగడుతున్నారని బుకాయించారు.

Imran Khan
ఇమ్రాన్​ ఖాన్
author img

By

Published : May 6, 2020, 10:51 PM IST

నియంత్రణ రేఖ వద్ద చొరబాట్ల విషయంలో భారత్​ అసత్య ప్రచారాలు చేస్తోందని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ ఆరోపించారు. ఈ పరిస్థితులను పాక్​కు వ్యతిరేకంగా భారత్​ ఉపయోగిస్తోందని బుకాయించారు.

"పాకిస్థాన్ లక్ష్యంగా భారత్​ చేస్తోన్న నిరంతర అసత్య ప్రచారాలకు సంబంధించి ప్రపంచాన్ని హెచ్చరిస్తున్నాను. నియంత్రణ రేఖ వెంబడి చొరబాట్లను పాక్​ ప్రేరేపిస్తున్నట్లు ప్రమాదకరమైన అజెండాను భారత్​ కొనసాగిస్తోంది."

- ఇమ్రాన్​ ఖాన్​, పాక్ ప్రధాని

అంతేకాకుండా కశ్మీర్​లో​ చెలరేగుతున్న హింస స్థానికమైనదేనని.. ఇందులో పాక్​కు ఎలాంటి సంబంధం లేదని కపట నీతి ప్రదర్శించారు ఇమ్రాన్​ ఖాన్​. భారత్​లోని అధికార పార్టీ విధానాలతో దక్షిణాసియాలో శాంతి భంగం కలుగుతుందని అన్నారు. అంతకు ముందే అంతర్జాతీయ సమాజం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలన్నారు.

ఇమ్రాన్​తోపాటు పాకిస్థాన్​ ముస్లిం లీగ్​ (నవాజ్​) అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత షెబాజ్​ షరీఫ్​ కూడా భారత్​పై అక్కసు వెల్లగక్కారు. ఉగ్ర స్థావరాలు, లాంచింగ్​ ప్యాడ్ల ఆరోపణలతో పాకిస్థాన్​కు వ్యతిరేకంగా భారత్​ కుట్ర పన్నుతోందని వల్లె వేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.