ఎఫ్-16 జెట్ విషయంలో భారతీయ జనతా పార్టీ అసత్యపు ప్రచారాలు చేస్తోందని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. పాక్‌లోని ఎఫ్-16 విమానాలన్నీ భద్రంగానే ఉన్నాయని అమెరికా మ్యాగజైన్ నివేదికపై ఈ విధంగా స్పందించారు ఇమ్రాన్. ఇటీవల అమెరికా అధికారులు పాక్‌లోని విమానాలను లెక్కించారని, అన్నీ సరిగానే ఉన్నాయని సదరు పత్రిక తెలిపింది.
నివేదికను ఆధారంగా చేసుకుని భాజపాపై విమర్శనాస్త్రాలు సంధించారు పాక్ ప్రధాని.
-
The truth always prevails and is always the best policy. BJP's attempt to win elections through whipping up war hysteria and false claims of downing a Pak F 16 has backfired with US Defence officials also confirming that no F16 was missing from Pakistan's fleet.
— Imran Khan (@ImranKhanPTI) April 6, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">The truth always prevails and is always the best policy. BJP's attempt to win elections through whipping up war hysteria and false claims of downing a Pak F 16 has backfired with US Defence officials also confirming that no F16 was missing from Pakistan's fleet.
— Imran Khan (@ImranKhanPTI) April 6, 2019The truth always prevails and is always the best policy. BJP's attempt to win elections through whipping up war hysteria and false claims of downing a Pak F 16 has backfired with US Defence officials also confirming that no F16 was missing from Pakistan's fleet.
— Imran Khan (@ImranKhanPTI) April 6, 2019
"నిజం ఎప్పటికైనా వెలుగులోకి వస్తుంది. ఎన్నికల్లో గెలవడానికి భాజపా తప్పుడు ప్రచారాలకు దిగింది. ఎఫ్-16 జెట్ల సంఖ్య సరిగానే ఉందని అమెరికా రక్షణ శాఖ అధికారులే తేల్చారు."
-ఇమ్రాన్ ఖాన్, పాక్ ప్రధాని
పాక్ ప్రధాని వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది భాజపా. ప్రతిపక్షాలపైనా ఎదురుదాడికి దిగింది. విపక్షాల తీరుతోనే పాకిస్థాన్ అడ్డగోలుగా వాదిస్తోందని ఆరోపించారు భాజపా నేతలు.
"దేశ సైన్యంపైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్న శ్యాం పిట్రోడా, ఫారుఖ్ అబ్దుల్లా వంటి నేతల వ్యాఖ్యలతో ఉగ్రవాదానికి ఆశ్రయమిచ్చే దేశాలకు మరింత బలాన్ని చేకూర్చుతున్నాయి. ఇది కచ్చితంగా క్షమించరాని చర్యే."
-పీయూష్ గోయల్, కేంద్ర రైల్వే శాఖ మంత్రి
ఫిబ్రవరి 28న అమ్రామ్ క్షిపణి భాగాలను భారత వాయుసేన ఆధారంగా చూపింది. ఎఫ్-16 విమానాలు మాత్రమే ఈ రకం క్షిపణులను ఉపయోగిస్తాయని ప్రకటించింది. అయితే... ఈ ఆరోపణలను పాకిస్థాన్ ఖండించింది. అమెరికా రక్షణ విభాగం వచ్చి పరీక్షించాలని పెంటగాన్‌ను కోరింది.
"ఎఫ్-16 యుద్ధ విమానాన్ని వింగ్ కమాండర్ అభినందన్ కూల్చివేశారని భారత వాయుసేన చెబుతోంది. అయితే వాస్తవిక పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి."
-అమెరికా మ్యాగజైన్ నివేదిక
ఇదీ చూడండి: ఎఫ్-16ను కూల్చింది నిజమే : భారత్