ETV Bharat / international

ఒకేసారి ఒక్కరితో గర్భం దాల్చాలని.. ఆ కవలల వింత కోరిక

ఆస్ట్రేలియాకు చెందిన "ప్రపంచంలోనే అత్యంత సమరూప కవలలు" తమ వింత కోరికను బయటపెట్టారు. అన్ని పనులు కలిసి చేసే వీరు.. ఇప్పుడు ఒకేసారు గర్భందాల్చి.. ఆ అనుభుతిని కూడా ఒకేసారి పొందాలనుకుంటున్నారు. తమ బాయ్​ఫ్రెండ్​ను ప్రస్తావిస్తూ ఈ కోరికను వెల్లడించారు. వీరి సంభాషణ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

'world's most identical twins' who share a bed with their mutual boyfriend reveal their plans to have IVF so they can get pregnant by him at 'exactly the same time'
ఓకేసారి ఒక్కరితో గర్బందాల్చని.. ఆ కవలల వింత కోరిక
author img

By

Published : Jul 29, 2020, 12:06 PM IST

Updated : Jul 29, 2020, 1:04 PM IST

వారిద్దరు ప్రపంచంలోనే "అత్యంత సమరూప కవలలు"గా ప్రసిద్ధి పొందారు. అంతేకాదు అక్కచెళ్లెల్లు అన్ని పనులు కలిసే చేస్తారు. అది తినడమైనా, పడుకోవడమైనా. వారిద్దరికీ బాయ్​ఫ్రెండ్​ కూడా ఒకరే. ఇప్పుడు ఆ కవలలు తమ జీవితాలను మరో అడుగు ముందుకు వెద్దామనుకుంటున్నారు. ఒకేసారు గర్భం దాల్చాలని ఫిక్స్​ అయ్యారు. ఇదెలా సాధ్యం?

తిండి నుంచి మంచం వరకు..

34ఏళ్ల ఆన్నా, లూసీ డిసిన్​క్యూ ఆస్ట్రేలియాలోని పెర్త్​లో నివసిస్తున్నారు. తిండి, గుడ్డతో పాటు అన్ని ఒకేలా ఉండేడట్టు చూసుకుంటారు. బాత్​రూమ్​కు కూడా కలిసే వెళ్తారు. ప్రస్తుతం వీరిద్దరు తమ బాయ్​ఫ్రెండ్​.. 39ఏళ్ల బెన్​ బైర్న్​తో కలిసి జీవిస్తున్నారు.

'world's most identical twins' who share a bed with their mutual boyfriend reveal their plans to have IVF so they can get pregnant by him at 'exactly the same time'
బాయ్​ఫ్రెడ్​ బెన్​తో ఆన్నా, లూసీ

ఇంతకు ముందు డేటింగ్​ చేసిన అబ్బాయిలందరూ తమను విడదీయడానికి ప్రయత్నించారని.. బెన్​ మాత్రం అందరికన్నా భిన్నమని ఈ అక్కాచెళ్లెల్లు చెప్పారు. బెన్​ వద్ద తమకు పూర్తి స్వేచ్ఛ ఉంటుందని తెలిపారు. అందుకే బెన్​తో ఒకే మంచాన్ని పంచుకుంటున్నామని పేర్కొన్నారు.

ఇటీవలే ఓ టీవీ షోలో పాల్గొన్న ఈ కవలలు తమ వింత కోరికను బయటపెట్టి అందరిని ఆశ్చర్యానికి గురిచేశారు. ఇప్పటివరకు అన్ని కలిసే చేసిన తాము.. గర్భం కూడా ఒకేసారి దాల్చాలనుకుంటున్నట్టు ప్రకటించారు. ఐవీఎఫ్​ పద్ధతిలో ఇది సాధ్యపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ ప్రెగ్నెన్సీ మాత్రం ఇద్దరికీ ఒక్కరితోనే ఒకే సమయంలో రావాలని కోరుకుంటున్నట్లు తేల్చిచెప్పారు.

"జీవితంలో అన్ని పనులు మేం కలిసే చేస్తాం. అన్నిటినీ కలిసే అనుభవిస్తాం. కలిసి జీవిస్తాం... కలిసి చనిపోతాం. అలాగే ఇప్పుడు గర్భాన్ని కూడా ఒకేసారి అనుభవిద్దామని అనుకుంటున్నాం. ఇందుకోసం ఐవీఎఫ్​ పద్ధతిని పరిశీలిస్తున్నాం. భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు. కానీ ఏదిఏమైనా ఇది మేము కలిసే చేయాలనుకుంటున్నాం."

--- ఆన్నా, లూసీ.

ఇది ఇతరులకు విడ్డూరంగా అనిపించినా.. తాము మాత్రం తమకు ఇష్టమున్నట్టు జీవించడానికి నిర్ణయించుకున్నట్టు వెల్లడించింది లూసీ. తమ మధ్య సోదరి బంధం బలంగా ఉందని చెప్పింది.

మరి వీరిద్దరిలో ఒకరు మగబిడ్డకు, మరొకరు ఆడబిడ్డకు జన్మనిస్తే పరిస్థితి ఏంటని టీవీ షో వ్యాఖ్యాత ప్రశ్నించగా.. 'మాకు ఫర్వాలేదు. బిడ్డలు ఆరోగ్యంగా, క్షేమంగా ఉన్నంత వరకు మాకు ఎలాంటి ఇబ్బంది లేదు' అని సమాధానమిచ్చారు.

బెన్​తో కవలలు

ఇదీ చూడండి:- మొల‌కు మాస్కు కట్టి.. లండన్ వీధుల్లో..

Last Updated : Jul 29, 2020, 1:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.