హాంకాంగ్‌లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతున్నాయి. తాజాగా నగరంలోని లయన్ రాక్ శిఖరంపై ఆదివారం 13 అడుగుల హాంకాంగ్ లేడీ లిబర్టీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు నిరసనకారులు. ప్రజాస్వామ్య అనుకూల ఉద్యమానికి ప్రతీకగా ఈ విగ్రహాన్ని వర్ణించారు.
ప్రజలు వారి భావాలను స్వేచ్ఛగా వ్యక్తపరచడమే లేడీ లిబర్టీ విగ్రహ స్థాపన ముఖ్య ఉద్దేశమని కార్యకర్తలు తెలిపారు. నిరసనకారులను ప్రతిబింబించేలా హెల్మెట్, ముసుగులు ధరించి, చేతిలో గొడుగు పట్టుకున్నట్లు ఈ విగ్రహాన్ని రూపొందించారు.
ఇదీ చూడండి : కాలుష్యం కోరల్లో చిక్కుకున్న రాజధాని నగరం