హాంగ్‌కాంగ్‌లో రాజకీయ వ్యవస్థ మారాలని ప్రజలు చేస్తోన్న నిరసనలు హింసాత్మకంగా మారాయి. గత వారం జరిగిన హింసాత్మక ఘటనలపై యూన్లాంగ్లో వేల మంది నిరసన వ్యక్తం చేయగా మరోసారి పోలీసులు ఆందోళనకారులపై బాష్పవాయు ప్రయోగం చేశారు.
గత వారం హాంగ్‌కాంగ్ నిరసనకారులపై చైనా సానుభూతిపరులు విచక్షణారహితంగా దాడి చేశారు. పోలీసులు కూడా ఆందోళనకారులపై లాఠీ ఛార్జ్ చేశారు. వీరి తీరుపై గర్హిస్తూ నేడు నిరసన బాట పట్టారు నిరసనకారులు.
తోపులాట
చైనా సానుభూతిపరులు యూన్‌లాంగ్ సమీపంలోని 2 గ్రామాల్లోకి పారిపోగా.. ఆ గ్రామాల్లోకి వెళ్లి నిరసన తెలిపేందుకు ఆందోళనకారులు ప్రయత్నించారు. ఈ చర్యను పోలీసులు అడ్డుకున్నారు. ఫలితంగా ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులు బాష్పవాయువు, రబ్బరు తూటాలు ప్రయోగించారు.
ఆదివారం ఘటనపై విమర్శలు
గత ఆదివారం జరిగిన ఘటనపై అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చాయి. స్పందించిన పోలీసులు నిరసనకారులపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. 12 మందిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.
హాంగ్‌కాంగ్ ఆందోళనలు మీడియాలో చూపటం చైనాలో నిషేధం. అక్కడి ప్రజలకు తెలియచేసేందుకు హాంగ్‌కాంగ్ విమానాశ్రయంలో వేలాదిమంది నిరసనకారులు కొద్ది గంటల పాటు ఆందోళన నిర్వహించారు.
ఇదీ చూడండి: హాంగ్‌కాంగ్: విదేశీయులకు కష్టాలు చెప్పుకున్న ప్రజలు