హాంకాంగ్‌లో గత 3 నెలలుగా జరుగుతోన్న నిరసనలు హింసాత్మకంగా మారాయి. పార్లమెంటు ముట్టడిని పోలీసులు అడ్డుకోగా ఆగ్రహంతో దగ్గరలోని మాంగ్కుక్ మెట్రో స్టేషన్‌కు పరుగులు తీశారు నిరసనకారులు. అర్ధరాత్రి సమయంలో కొంత మంది ఆందోళనకారులు స్టేషన్‌కు నిప్పు అంటించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.
ఉద్రిక్త పరిస్థితులు
మరి కొంత మంది ఆందోళనకారులు ప్రభుత్వ భవనాలపై రాళ్లు రువ్వి, పోలీసులపై లేజర్ లైట్లను ప్రయోగించారు. ఈ క్రమంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. నిరసనకారులను అదుపు చేసేందుకు పోలీసులు బాష్పవాయువు, గ్యాసోలైన్ బాంబులు, పెప్పర్ స్ప్రే, వాటర్గన్లను ప్రయోగించారు. ఈ ఘటనల్లో పలువురు గాయపడ్డారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో సంస్కరణలు, చైనా బిల్లు రద్దు, సార్వత్రిక ఎన్నికలు, ప్రస్తుత రాజ్యాంగ రద్దు, పోలీసుల అరాచకాలపై విచారణ చేపట్టాలని ఆందోళనలు చేస్తున్నారు హాంకాంగ్ ప్రజలు.
ఇదీ చూడండి:కిడ్నీ సమస్యతో బాధ పడుతున్న లాలూ ప్రసాద్