సాధారణంగా ప్రయాణికుల కుటుంబ సభ్యులు, స్నేహితులు వేచి ఉండే గదిని శుక్రవారం నల్లరంగు దుస్తులు ధరించిన ఆందోళనకారులు ఆక్రమించారు. ప్లకార్డులు పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హాంగ్‌కాంగ్‌కు విముక్తి కల్పించాలని బ్యానర్లు ఏర్పాటు చేశారు. ప్రయాణికులకు, విమాన రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలిగించకుండా శాంతియుతంగా నిరసనలు చేపట్టారు.
" ఇటీవలి కాలంలో హాంగ్‌కాంగ్‌లో ఏం జరుగుతుందో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మందికి తెలపటమే మా ప్రధాన లక్ష్యం. గతంలో ఉన్నట్టుగా హాంగ్‌కాంగ్ ఇప్పుడు ఎందుకు లేదు?"
- ఆండీ హో, నిరసనల ఆర్గనైజర్.
హాంగ్‌కాంగ్ నిరసనల నేపథ్యం
నేరపూరిత కేసుల విచారణ నిమిత్తం తమ దేశ పౌరులను చైనాకు అప్పగించాలన్న బిల్లుకు వ్యతిరేకంగా హాంగ్‌కాంగ్‌లో ఎన్నో రోజులుగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్నారు. వారం రోజుల నిరసనల అనంతరం బిల్లును పక్కన పెట్టింది ప్రభుత్వం. కానీ ఆందోళనలు సద్దుమణగలేదు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో సంస్కరణలు, చైనా బిల్లు రద్దు, సార్వత్రిక ఎన్నికలు, ప్రస్తుత రాజ్యాంగ రద్దు, పోలీసుల అరాచకాలపై విచారణ చేపట్టాలని నెల రోజులుగా ఆందోళనలు కొనసాగిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో నిరసనలు హింసాత్మకంగా మారి పలువురు గాయపడ్డారు.
ఇదీ చూడండి:విహారి: ఇది రష్యా శైలి సంక్రాంతి గురూ!