హాంగ్‌కాంగ్‌లో నిరసన జ్వాలలు తారస్థాయికి చేరుకున్నాయి. 'సిమ్ సా సుయ్' పోలీస్ స్టేషన్ పరిధిలో కొంతమంది నిరసనకారులు విధ్వంసం సృష్టించారు. పోలీస్ స్టేషన్‌పైకి ఇటుకలతో దాడికి దిగారు. గోడలపై ఆగ్రహపూరిత వాఖ్యలు రాశారు. ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
పోలీసులకు మద్దతు
కొంత మంది తెలుపు రంగు దుస్తులు ధరించి హాంగ్‌కాంగ్ పార్కు వద్దకు చేరి పోలీసులకు మద్దతు ప్రకటించారు. దేశంలో నెలకొన్న హింసకు వ్యతిరేకంగా ప్రదర్శనలు నిర్వహించారు. హాంగ్ కాంగ్, చైనా జాతీయ పతాకాలను ప్రదర్శించారు.
ఇదీ చూడండి: 'దారికి రాకపోతే అంతే'... చైనాకు ట్రంప్ హెచ్చరిక