ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనతో హాంకాంగ్ అట్టుడుకుతోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఐదు నెలలుగా ప్రజసామ్య ఉద్యమకారులు చేస్తున్న నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. హాంకాంగ్ పాలిటెక్నిక్ విశ్వవిద్యాలయంలో ఆందోళనకారులు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణ యుద్ధాన్ని తలపించింది.
నిరసనకారులను అదుపు చేసేందుకు పోలీసులు బాష్పవాయుగోళాలను, జల ఫిరంగులను ప్రయోగించారు. పోలీసులపైకి ఆందోళనకారులు రాళ్లు, చేతికందిన వస్తువులను విసిరారు. బాష్పవాయుగోళాల దాడిని తట్టుకునేందుకు నిరసనకారులు ప్రత్యేక శిరస్త్రాణాలు ధరించారు. గొడుగులు అడ్డుపెట్టుకున్నారు. విశ్వవిద్యాలయానికి వెళ్లే దారిలో ఉన్న అవరోధాలను తొలగించేందుకు పోలీసులు ప్రయత్నించగా విద్యార్థులు అడ్డుకున్నారు.
పోలీసుపై బాణంతో దాడి..
నిరసనకారులతో జరిగిన ఘర్షణలో ఓ పోలీసు గాయపడ్డాడు. ఒక ఆందోళన కారుడు విసిరిన బాణం.. అధికారి కాలులోకి దూసుకెళ్లింది. అతడ్ని ఆస్పత్రికి తరలించారు.
వెనక్కెతగ్గే ప్రసక్తే లేదు..
పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చిన తర్వాత వలంటీర్లు, ప్రజలు, చైనా సైనికుల రోడ్డుపై అవరోధాలను తొలగించారు.
ప్రభుత్వం తమ డిమాండ్లకు అంగీకరించే వరకు ఆందోళన విరమించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు విశ్వవిద్యాలయంలో నిరసన కొనసాగిస్తున్న విద్యార్థులు.
ఇదీ చూడండి: ప్రధానితో 'బంధం' గురించి జెన్నిఫర్ చెప్పిన కథ ఇది!