హాంకాంగ్ అత్యున్నత స్థాయి చట్టసభలో సభ్యులు ఘర్షణపడ్డారు. సమావేశం ప్రారంభానికి ముందే ఇరువర్గాలు ఒకర్ని ఒకరు దూషించుకున్నారు. కాగితాలు విసురుకున్నారు. ఇదే చివరకు తోపులాటకు దారితీసింది. దీంతో సభను తాత్కాలికంగా వాయిదా వేశారు. సహ సభ్యుల చొరవతో గొడవ సద్దుమణిగింది. ఇలా ఘర్షణ జరగడం ఈ నెలలో రెండోసారి.
ఇదే కారణం!
2019 అక్టోబరు నుంచి ప్రజాస్వామ్యవాది అయిన డెన్నీస్ క్వాక్.. సభకు అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే ఆయన్ని తొలగించి చైనా ప్రభుత్వ అనుకూల వ్యక్తిని తాత్కాలికంగా నియమించడమే ఈ రభసకు తెరతీసింది. త్వరలో తాత్కాలిక అధ్యక్షుడు, బీమా వ్యాపార ప్రతినిధి చాన్ కిన్ పోర్ ఆధ్వర్యంలోనే.. కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరగనుంది. ఇతడు చైనాకు మద్దతుదారుడు కావడం వల్ల అధ్యక్షుడూ చైనా ప్రభుత్వానికి చెందిన వారినే నియమిస్తారని.. హాంకాంగ్ ప్రజాస్వామ్యవాదులు గొడవ చేశారు.
హాంకాంగ్‌పై ఆధిపత్యం చెలాయించేందుకు చైనా చాలా ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తోంది. ఆ దేశంలో ఎవరైనా చైనా జాతీయగీతాన్ని అవమానపరిస్తే వారిని శిక్షించే విధంగానూ బిల్లు తీసుకురావాలని యోచిస్తోంది. అయితే చైనా ధోరణిని అక్కడి ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
ఇదీ చూడండి: 'సెప్టెంబర్ నాటికి 30 మిలియన్ వ్యాక్సిన్ డోస్‌లు'