జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేకాధికారాలు కల్పించే అధికరణ 370 రద్దుపై అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే)ను ఆశ్రయించాలన్న పాకిస్థాన్ ప్రయత్నానికి ఆదిలోనే అడ్డుకట్ట పడింది. కశ్మీర్ అంశాన్ని ప్రపంచ వేదికలపై ప్రస్తావించి.. భారత్‌ను ఒంటరిని చేయాలన్న ప్రయత్నాలు బెడిసికొట్టి.. ప్రపంచ దేశాల ముందు పాకిస్థానే అపహాస్యం పాలైంది. ఈ నేపథ్యంలో కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ కోర్టు ముందుకు తీసుకురావాలని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం భావిస్తోంది.
పాక్‌కు ఆధారాలు లేవు..
ఈ విషయంపై స్పందించిన ఐసీజేలోని పాకిస్థాన్ తరఫు న్యాయవాది ఖవర్ ఖురేషి.. కశ్మీర్‌లో మారణహోమం జరుగుతోందని నిరూపించేందుకు సరైన ఆధారాలు లేవన్నారు. ఓ వార్తా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
ఐరాసలోని 1948నాటి మారణహోమ ఒప్పందం ప్రకారం పాకిస్థాన్ అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్లే అవకాశం ఉన్నా.. అందుకు తగిన ఆధారాలు లేవని ఖురేషి కుండబద్దలు కొట్టారు.
కులభూషణ్ జాదవ్ కేసులో ఐసీజేలో పాక్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఖురేషీ.
ఆర్టికల్ 370 రద్దు తమ అంతర్గత వ్యవహారమన్న భారత్ వాదనను ప్రపంచదేశాలన్నీ సమర్థించాయి. ఉద్రిక్తతలు తగ్గేందుకు భారత్‌తో ద్వైపాక్షిక చర్చలే పరిష్కారమని పాకిస్థాన్‌కు సూచించాయి. అయితే ఉగ్రవాదాన్ని ఉసిగొల్పే చర్యలు ఆపనంతవరకు చర్చల ప్రసక్తే లేదని భారత్ తేల్చిచెప్పింది.
ఇదీ చూడండి: మాల్దీవులు వేదికగా పాక్‌కు భంగపాటు