ETV Bharat / international

ఆ పార్కులో ఎటు చూసినా భారీ మంచు శిల్పాలే..! - TELUGU INTERNATIONAL TOURIST SNOW PARKS

ఎటు చూసినా భారీ మంచు శిల్పాలు, రంగురంగుల విద్యుత్​ కాంతులు.. చూడటానికి రెండు కళ్లు సరిపోవు. ఏంటీ వింత అనిపిస్తుంది. చైనాలోని ముదాంజియాంగ్​ ఉద్యానవనం ఇందుకు వేదికైంది. ఆ విశేషాలు తెలుసుకుందామా?

HEAVEY SNOW CARTOON CASTLES ARE BEING ATTRACTION TO THE TOURISTS AT CHINA
ఆ పార్కులో ఎటు చూసినా భారీ మంచు శిల్పాలే..!
author img

By

Published : Dec 29, 2019, 6:27 PM IST

Updated : Dec 29, 2019, 8:08 PM IST

ఆ పార్కులో ఎటు చూసినా భారీ మంచు శిల్పాలే..!

భారీ మంచు శిల్పాల అందాలు, రంగురంగుల విద్యుత్​ కాంతుల దగదగలతో చైనాలోని ముదాంజియాంగ్​ ఉద్యానవనం మెరిసింది. హీలాంగ్జియాంగ్​ రాష్ట్రంలోని ఈ పార్కు 19వ వార్షికోత్సవం సందర్భంగా మంచు శిల్పాలను ఏర్పాటు చేశారు.

60 వేల చదరపు మీటర్ల విస్తీర్ణం గల ఈ పార్కులో.. 80 రకాల మంచు శిల్పాలను రూపొందిచారు. 'టామ్​ అండ్​ జెర్రీ', 'లాస్ట్ నైట్'​ వంటి కార్టూన్​ తరహా పాత్రలకు సంబంధించిన మంచు శిల్పాలు వీక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ అద్భుత దృశ్యాలను తమ చరవాణిలో బంధించేందుకు పర్యటకులు పోటీ పడుతున్నారు.

"నేను ముదాంజియాంగ్​కు రావడం ఇదే తొలిసారి. ఇక్కడ మంచు శిల్పాలను ప్రదర్శనకు ఉంచారని తెలిసి చూడటానికి వచ్చాను. ఇంత పెద్ద మంచు బొమ్మలను చూడటం నా జీవితంలో ఇదే మొదటి సారి."

-జిన్​ లాన్​, పర్యటకురాలు

ఈ మంచు వనాన్ని 2001లో ముదాంజియాంగ్​ నగరంలో ప్రారంభించారు. ఈ ప్రాంతం చైనా మంచు నగరంగా ప్రసిద్ధి చెందింది. ఏటా ఈ పార్కును సందర్శించేందుకు దేశ విదేశాల నుంచి వేలాది మంది పర్యటకులు వస్తుంటారు.

ఇదీ చదవండి:భళా రివన్​.. భారత్​ టు అమెరికా వయా 'సాట్​'

New Delhi, Dec 29 (ANI): Deputy Chief Minister Keshav Prasad Maurya on viral video of Meerut SP where he was seen telling protesters to go back to Pakistan stated that the statement was not for the Muslims but probably for th ose who were raising pro Pakistan slogans. "He did not say it for all Muslims but probably to those who were raising pro Pakistan slogans while pelting stones. For anyone involved in such activities, SP city's statement is not wrong," said UP Dy CM.
Last Updated : Dec 29, 2019, 8:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.