ETV Bharat / international

తాలిబన్ల దాష్టీకం.. అఫ్గాన్‌ ఉన్నతాధికారి దారుణ హత్య - తాలిబన్​ హింస

అఫ్గానిస్థాన్​లో తాలిబన్ల హింసాత్మక ఘటనలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వ నేతలే లక్ష్యంగా దాడులు చేస్తున్నారు. తాజాగా ఆ దేశ ప్రభుత్వం మీడియా, సమాచార శాఖకు చెందిన ఉన్నతాధికారిని హతమార్చారు.

Afghan official assassinated by Taliban
తాలిబన్ల దాడి
author img

By

Published : Aug 6, 2021, 7:38 PM IST

అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లు మరోమారు దాష్టీకానికి పాల్పడ్డారు. అక్కడి ప్రభుత్వ మీడియా, సమాచార శాఖకు చెందిన ఉన్నతాధికారి అయిన దవాఖాన్‌ మీనాపాల్‌ను హతమార్చారు. దేశ రాజధాని నగరం కాబూల్‌లో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రార్థానా మందిరంలో అతడిని కాల్చి చంపారు. తమపై జరుగుతున్న రాకెట్‌ దాడులకు ప్రతీకారంగా దాడులు చేస్తామన్న తాలిబన్ల హెచ్చరికల అనంతరం ఈ దారుణం జరగడం గమనార్హం.

దవాఖాన్‌ మృతిని అఫ్గాన్‌ ప్రభుత్వం సైతం ధ్రువీకరించింది. అఫ్గాన్‌కు చెందిన ప్రముఖ అధికారిని దారుణంగా తాలిబన్లు హతమార్చారని ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. తాలిబన్లు సైతం ఇది తమ పనేనని ప్రకటించారు.

అమెరికా భద్రతా బలగాలు వెనక్కి వెళ్లిన నాటి నుంచి తాలిబన్లు దారుణాలు పెచ్చుమీరాయి. అఫ్గాన్‌లోని కీలక ప్రాంతాలు ఇప్పటికే వారి వశమయ్యాయి. మరోవైపు తాలిబన్లు మంగళవారం జరిపిన బాంబు దాడి నుంచి రక్షణ మంత్రి త్రుటిలో తప్పించుకోగా.. ఇదే తరహాలో అఫ్గాన్‌ ప్రభుత్వ నేతలే లక్ష్యంగా మరిన్ని దాడులు ఉంటాయని తాలిబన్లు ఇది వరకే ప్రకటించారు.

ఇదీ చూడండి: సైన్యం దాడిలో 94 మంది తాలిబన్లు హతం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.