ETV Bharat / international

ఒక్క ఔషధంతో కొవిడ్ చికిత్స!

కొవిడ్​ను అడ్డుకునేందుకు ఆస్ట్రేలియా-అమెరికా శాస్త్రవేత్తలు ప్రత్యేక ఔషధాన్ని రూపొందించారు. కరోనా బాధితులకు ఐదు రోజుల పాటు నిత్యం ఇంజెక్షన్​ రూపంలో ఈ ఔషధాన్ని ఇవ్వడం ద్వారా కొవిడ్​కు అడ్డుకట్ట వేయొచ్చని పేర్కొన్నారు.

direct acting anti viral covid, griffith university research covid
కొవిడ్​ చికిత్స
author img

By

Published : May 20, 2021, 7:37 AM IST

ఒక్క ఔషధంతో కొవిడ్​ను అడ్డుకునే దిశగా ఆస్ట్రేలియా-అమెరికా శాస్త్రవేత్తల బృందమొకటి పురోగతి సాధించినట్టు తెలుస్తోంది. గ్రిఫిత్​ యూనివర్సిటీకి చెందిన మెంజీస్​ హెల్త్​ ఇన్​స్టిట్యూట్​ నేతృత్వాన తయారుచేసిన ప్రత్యేక ఔషధాన్ని ఎలుకలపై ప్రయోగించగా, మంచి ఫలితాలు వచ్చాయట. జీవ కణాల్లోకి ప్రవేశించిన వైరస్​ అభివృద్ధి చెంది, సంతతిని పెంచుకోకుండా ఈ మందు అడ్డుకుంటుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఎలుకలపై పరీక్షలు నిర్వహించగా.. వైరస్​ పార్టికల్స్​ 99.9 శాతం మేర క్షీణించాయని, మనుషుల్లోనూ ఇదే ఫలితం వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాయి. కరోనా బాధితులకు ఐదు రోజుల పాటు నిత్యం ఇంజెక్షన్​ రూపంలో ఇవ్వడం ద్వారా కొవిడ్​కు అడ్డుకట్ట వేయొచ్చని తెలిపాయి. మనుషులపై ప్రయోగ పరీక్షలు పూర్తికావడానికి మరికొంత సమయం పడుతుందని వెల్లడించాయి.

వైరస్​లోని చాలా భాగాల్లో (పార్టికల్స్​లో) కరోనాకు సంబంధించిన సమాచారమే ఉంటుంది. దాని ఆర్​ఎన్​ఏ, డీఎన్ఏ రహస్యాలను ఈ పార్టికల్స్​ మనిషిలోని జీవకణాలకు బదిలీ చేసి, వాటిని కూడా వైరస్​గా మార్చేందుకు తోడ్పడతాయి. పరిశోధకులు రూపొందించిన ఔషధం.. ఈ వైరస్ భాగాలపై దాడిచేసి, షార్ట్​/స్మాల్​ ఇంటర్​ఫెరింగ్​ ఆర్​ఎన్​ఏ సమాచారాన్ని బదిలీ చేయకుండా వాటిని అడ్డుకుంటుందట! తద్వారా వైరస్​ సంతతి పెరగదని నిపుణులు చెప్తున్నారు. ఎలాంటి రకం కరోనా వైరస్​కైనా ఈ సాంకేతికత పనిచేస్తుంది కాబట్టి.. ఈ ఔషధం అన్ని రకాల స్ట్రేయిన్​ల నుంచి విముక్తి పొందడానికి సహాయపడుతుందని వివరించారు.

ఇదీ చదవండి : 'భారత్​లో 13% తగ్గిన కరోనా కేసులు.. కానీ..'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.