ETV Bharat / international

ఇళ్లను ముంచెత్తిన మెరుపు వరద- 40 మంది బలి - floods afghanistan

ఆకస్మిక వరదల కారణంగా దాదాపు 80కి పైగా ఇళ్లు ధ్వంసమై 40 మంది మృతి చెందారు. 150 మంది గల్లంతయ్యారు. ఈ ఘటన అఫ్గానిస్థాన్​లో జరిగింది.

Flash floods
అకాల వరదలు
author img

By

Published : Jul 29, 2021, 1:44 PM IST

Updated : Jul 29, 2021, 2:30 PM IST

అఫ్గానిస్థాన్​, నురిస్తాన్ రాష్ట్రంలోని కామ్​డిష్​ జిల్లాలో ఆకస్మిక వరదలు సంభవించాయి. ఫలితంగా 40మంది మృతి చెందారు. మరో 150మంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. దాదాపు 80కి పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయని పేర్కొన్నారు.

40 మృతదేహాలను గుర్తించామని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ప్రావిన్షియల్​ కౌన్సిల్​ సయదుల్లా నూరిస్తానీ తెలిపారు. సహాయక చర్యలను ముమ్మరం చేశామన్నారు.

గత నెలలోనూ..

గత నెలలోనూ.. భారీ వర్షాలు, వరదల కారణంగా అఫ్గానిస్థాన్​లోని హెరాత్​ రాష్ట్రంలో 12 మంది మృతిచెందారు. పదుల సంఖ్యలో ఇళ్లు ధ్వంసమయ్యాయి.

ఇదీ చదవండి: అమెరికాలో భూకంపం- సునామీ హెచ్చరికలు జారీ

Last Updated : Jul 29, 2021, 2:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.