చైనాలోని ఓ ఉద్యానవనంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. 8 రోజుల జాతీయ సెలవుల ప్రారంభం రోజునే చైనా థీమ్ పార్క్‌లో ప్రమాదం జరగటం పర్యటకుల్లో ఆందోళన పెంచింది.
షాంగ్జి రాష్ట్రం తైయువాన్ నగర శివారులోని టైటాషన్ థీమ్ పార్క్‌లో మంచు శిల్పాల ప్రదర్శన సందర్భంగా గురవారం అగ్ని ప్రమాదం జరిగినట్లు అత్యవసర నిర్వహణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ఘటనలో 13 మంది మరణించగా 15 మందికి తీవ్ర గాయాలయ్యాయని, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్లు తెలిపింది.
జాతీయ స్థాయి సంస్థ స్టేట్ కౌన్సిల్‌లోని పని భద్రత కమిటీ అగ్ని ప్రమాదానికి సంబంధించి దర్యాప్తు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.
మ్యూజియంలు, రైడ్స్, ఇతర ఆకర్షణలతో కూడిన విస్తారమైన ఉద్యానవనం టైటాషన్.
ఇదీ చూడండి: అఫ్గాన్‌లో కారుబాంబు దాడి- 9 మంది మృతి