ETV Bharat / international

Afghanistan Journalist: అఫ్గాన్‌ను వీడిన 'ఆమె'..! - అఫ్గాన్‌ను వీడిన జర్నలిస్టు

తాలిబన్లతో(Afghanistan Taliban news) ఇంటర్వ్యూ చేసి సంచలనం సృష్టించిన మహిళా జర్నలిస్టు అఫ్గాన్​ను (Afghanistan Journalist) వీడిపోయింది. మలాలాతో చేసిన ఇంటర్వ్యూ తర్వాతే ఆమె ఈ నిర్ణయం తీసుకుంది. "లక్షల మంది అఫ్గాన్‌ ప్రజల వలే నేను నా దేశాన్ని విడిచి వెళ్లపోతున్నాను. తాలిబన్లకు భయపడుతున్నాను" అని ఆవేదన వ్యక్తం చేసింది.

Arghand leaves Afghanistan
తాలిబన్
author img

By

Published : Aug 31, 2021, 8:25 AM IST

తాలిబన్లు అఫ్గానిస్థాన్‌ను(Afghanistan Taliban news) ఆక్రమించిన తర్వాత వారు టొలో న్యూస్‌కు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సమయంలో తాలిబన్‌ ప్రతినిధి ఇంటర్వ్యూను ఓ మహిళా జర్నలిస్టు తీసుకొంది. అప్పట్లో అది ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తాలిబన్లు కూడా తాము మారిపోయాం అని చెప్పుకోవడానికి ఆ ఇంటర్వ్యూను వాడుకొన్నారు. కానీ, తాజాగా ఆ మహిళా జర్నలిస్టు (Afghanistan Journalist) ప్రాణభయంతో దేశం విడిచి పారిపోయింది.

టొలో న్యూస్‌లో కొత్తగా చేరిన 24 ఏళ్ల బెహెస్తా అర్ఘాంద్‌ ఈ నెల 17వ తేదీన తాలిబన్ల ప్రతినిధిని ఇంటర్వ్యూ చేసింది. ఇది పత్రికల పతాక శీర్షికలను ఎక్కింది. కానీ, ఆమె తాలిబన్‌ చేతిలో దాడికి గురైన మలాలా యూసఫ్‌ జాయ్‌ను కూడా ఆ తర్వాత ఇంటర్వ్యూ చేసింది. మలాలా టోలో న్యూస్‌కు ఇంటర్వ్యూ ఇవ్వడం కూడా అదే తొలిసారి. ఇది బెహస్తాను ప్రమాదంలోకి నెట్టింది. ఆమె ఆఫీస్‌కు వెళ్లడం మానేసింది. చివరికి దేశం విడిచి వెళ్లిపోయింది. "లక్షల మంది అఫ్గాన్‌ ప్రజల వలే నేను నా దేశాన్ని విడిచి వెళ్లపోతున్నాను. తాలిబన్లకు(Taliban news) భయపడుతున్నాను" అని ఆమె పేర్కొన్నారు. ఆమె ఈ విషయాన్ని సీఎన్‌ఎన్‌ బిజినెస్‌కు వాట్సాప్‌ సందేశం ద్వారా తెలియజేశారు.

d
తాలిబన్లు

కల చెదిరింది..

బెహెస్తా అర్ఘాంద్‌ తొమ్మిదో తరగతి చదువుతుండగా జర్నలిస్టు కావాలని ఆశించంది. పాఠశాల తరగతి గదిలో టీచర్‌ ప్రోత్సాహంతో ఆమె ఓ న్యూస్‌ యాంకర్‌ వలే వార్తలు చదివారు. ఆ ఘటన ఆమెలో టీవీ జర్నలిస్టు కావాలనే ఉత్సాహాన్ని పుట్టించింది. ఆ తర్వాత ఆమె కాబుల్‌ విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం పట్టా అందుకొన్నారు. అనంతరం ఆమె చాలా న్యూస్‌ ఏజెన్సీలు, రేడియోల్లో పనిచేశారు. ఎట్టకేలకు అఫ్గానిస్థాన్‌కు చెందిన ప్రముఖ ఛానెల్‌ టొలో న్యూస్‌లో చేరారు. కానీ, ఆమె అక్కడ నెలా ఇరవై రోజులు మాత్రమే విధులు నిర్వహించారు. ఈ లోపు కాబుల్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకొన్నారు.

చరిత్రలో తొలిసారి తాలిబన్‌తో టీవీ ఇంటర్వ్యూ..

ఆగస్టు 17వ తేదీన అఫ్గాన్‌(Afghanistan news) చరిత్రలో తొలిసారి తాలిబన్‌ ప్రతినిధి టీవీ స్టూడియోలో కూర్చొని ఇంటర్వ్యూ ఇచ్చాడు. అది ఒక మహిళా యాంకర్‌కు..! బెహెస్తా అర్ఘాంద్‌కు ఈ ఇంటర్వ్యూ ఓ రకంగా ప్రాణాంతకమే. కానీ, అఫ్గాన్‌ మహిళల కోసం ఆమె ధైర్యం చేశారు. "మాలో ఎవరో ఒకరు కచ్చితంగా మొదలు పెట్టాల్సిందే.. అలా కాకుండా ఇళ్ల వద్దే ఉండిపోయినా.. ఆఫీసులకు వెళ్లకపోయినా తాలిబన్లు నింద మాపై వేస్తారు. 'మహిళలే ఉద్యోగాలు చేయాలనుకోట్లేదు' అన్నట్లు చిత్రీకరిస్తారు. చివరికి ధైర్యం చేశాను. తాలిబన్‌ ప్రతినిధికి ఒక విషయం చెప్పాను. మా హక్కులు మాకు కావాలని, సమాజంలో తాము భాగం కావాలని పేర్కొన్నాను" అని సీఎన్‌ఎన్‌కు వెల్లడించారు.

ఖతార్‌ విమానంలో..

నోబెల్‌ విజేత మలాల ఇంటర్వ్యూ తర్వాత దేశం వీడాలని బెహెస్తా అర్ఘాంద్‌ నిర్ణయించుకొంది. వెంటనే ఆమె సామాజిక కార్యకర్తను సాయం కోరింది. గత మంగళవారం ఖతర్‌ వాయుసేన విమానంలో దేశాన్ని వీడింది. తిరిగి అఫ్గాన్‌ గడ్డపై తిరిగి అడుగు పెడతాన్ని గంపెడు ఆశతో దేశాన్ని వీడింది. "తాలిబన్లు ఇచ్చిన మాట నిలబెట్టుకొంటే పరిస్థితులు కచ్చితంగా మెరుగుపడతాయి. నేను సురక్షితం అని భావించిన వెంటనే స్వదేశానికి వెళతాను. అక్కడ దేశం కోసం పనిచేస్తాను" అని భావోద్వేగంగా వెల్లడించింది.

టొలో న్యూస్‌ను వీడిన జర్నలిస్టులు..

అఫ్గాన్‌లో ప్రధాన మీడియా సంస్థ తీవ్ర సంక్షోభంలో పడింది. తాలిబన్ల దెబ్బకు భయపడి చాలా మంది జర్నలిస్టులు వార్తాసంస్థను వదిలి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని టొలో న్యూస్‌ యజమాని సాద్‌ మొహసెని తెలిపారు. "దాదాపు మా రిపోర్టర్లు, జర్నలిస్టులు మొత్తం సంస్థను వీడారు. మేము వారి స్థానాలను భర్తీ చేయడానికి తీవ్రంగా కృషి చేస్తున్నాం. మా వారిని ప్రమాదాల నుంచి దూరంగా ఉంచడం, కార్యకలాపాలను కొనసాగించడం సవాలుగా మారింది" అని తెలిపారు.

ఇదీ చూడండి: Afghan News: ఆ రిపోర్టర్​ను తాలిబన్లు కొట్టి చంపారా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.