అక్రమ నగదు చలామణిని అరికట్టి, ఉగ్రవాద సంస్థలకు నిధులు అందకుండా చేసే కార్యాచరణ ప్రణాళికను పాకిస్థాన్ సరిగ్గా అమలు చేస్తోందో లేదో అనే విషయాన్ని గ్లోబల్ వాచ్డాగ్ 'ఎఫ్ఏటీఎఫ్' పరిశీలించనుంది. పాకిస్థాన్ ఒకవేళ ఉగ్రవాద నిరోధక చర్యలు తీసుకోవడంలో విఫలమైతే దానిని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టే అవకాశమూ ఉంది.
బ్యాంకాక్‌కు పాక్...
'ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అధికారులను కలవడానికి పాకిస్థాన్ ప్రతినిధి బృందం సెప్టెంబర్ 7న బ్యాంకాక్ వెళ్లనుంది. సెప్టెంబర్ 8 నుంచి 10 వరకు జరిగే చర్చల్లో... ఉగ్రవాదులకు నిధులు అందకుండా పాక్ చేపడుతున్న చర్యలను ఎఫ్ఏటీఎఫ్ అధికారులకు ఈ బృందం వివరించనుంది' అని సమా టీవీ పేర్కొంది.
అలాగే ఎఫ్ఏటీఎఫ్ అడిగే 100 అదనపు ప్రశ్నలకూ ఈ బృందం సమాధానాలు ఇవ్వనుందని తెలిపింది.
ఆగస్టు 18 నుంచి 23 వరకు ఆస్ట్రేలియా రాజధాని కాన్బెర్రాలో ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ వార్షిక (ఆసియా-పసిఫిక్) సమావేశం జరిగింది. ఈ భేటీలో ఉగ్రవాద నిరోధానికి తాము చేపడుతున్న 27 పాయింట్ల కార్యాచరణ ప్రణాళిక సమ్మతి నివేదికను పాక్.... ఏఎఫ్టీఎఫ్కు సమర్పించింది.
బ్లాక్‌లిస్ట్‌లోకి..
పాక్ నివేదికను మూల్యాంకనం చేసిన తరువాత... దానిని ఇప్పుడున్న గ్రే లిస్టు నుంచి బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలా లేదా అన్నది ఎఫ్ఏటీఎఫ్ నిర్ణయిస్తుంది.
గతేడాది... అక్రమ నగదు చలామణి, ఉగ్రవాద సంస్థలకు నిధులు అందకుండా చేసే కార్యాచరణ ప్రణాళికను పూర్తి చేయని పాకిస్థాన్, ఇరాన్‌లపై ఎఫ్ఏటీఎఫ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్టోబర్‌లోగా తగిన చర్యలు తీసుకోకపోతే బ్లాక్‌లిస్ట్‌లో పెడతామని హెచ్చరించింది.
ఇదీ చూడండి: 6 ప్లాన్లతో జియో ఫైబర్ సేవలు ప్రారంభం