ETV Bharat / international

కోర్టులో 'నరమేధం' ముష్కరుడు - court

న్యూజిలాండ్​లోని ​క్రైస్ట్​చర్చ్, లిన్​మోర్ మసీదులపై కాల్పులకు తెగబడిన దుండగుడిని హత్యానేరం కింద కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. భారీ భద్రత మధ్య విచారణ చేపట్టింది న్యాయస్థానం. తదుపరి విచారణను ఏప్రిల్​ 5కు వాయిదా వేసింది.

కోర్టులో 'నరమేధం' నిందితుడు
author img

By

Published : Mar 16, 2019, 10:29 AM IST

Updated : Mar 16, 2019, 10:53 AM IST

కోర్టులో 'నరమేధం' ముష్కరుడు
క్రైస్ట్​చర్చ్, లిన్​మోర్ మసీదులపై మారణహోమం సృష్టించిన దుండగుడిని సంకెళ్లతో న్యాయస్థానానికి తీసుకువచ్చారు పోలీసులు. ఈ దాడిలో 49 మంది మృతి చెందారు. అతివాద భావజాలానికి ప్రేరేపితుడైన బ్రెంటన్​​ టారంట్​ను హత్యానేరం కింద కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆవరణలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. అతనిపై ఉన్న అభియోగాన్ని చదివి వినిపించిన న్యాయమూర్తి తదుపరి విచారణను ఏప్రిల్​ 5కు వాయిదా వేశారు.

ఆస్ట్రేలియాకు చెందిన బ్రెంటన్​ టారంట్​ నేరస్థుల దుస్తుల్లో కనిపించాడు. కోర్టు తనపై హత్యాభియోగాలు మోపుతున్నప్పటికీ బ్రెంటన్ నిశ్శబ్దంగానే ఉన్నాడు. నిందితుడిపై మరిన్ని నేరాభియోగాలు చేసే అవకాశం ఉంది. తదుపరి విచారణ వరకు నిందితుడు పోలీసుల కస్టడీలోనే ఉండాలని ఆదేశించింది కోర్టు.

తుపాకీ లైసెన్స్​ కఠినతరం

మసీదులపై జరిగిన దాడిని ఉగ్రచర్యగా పేర్కొన్నారు న్యూజిలాండ్​ ప్రధాని జసిండా అర్డెర్న్​. కాల్పులకు పాల్పడిన వ్యక్తి 2017,నవంబర్​లో తుపాకీ లైసెన్స్​ తీసుకున్నట్లు తెలిపారు. చట్టపరంగా రెండు సెమి ఆటోమేటిక్​ ఆయుధాలు, రెండు తుపాకులు, మరొక చిన్న తుపాకీని కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. టారెంట్​పై ఇప్పటివరకు ఎటువంటి నేరచరిత్ర లేదని వెల్లడించారు.

లైసెన్స్​ పొందిన తుపాకులతో నరమేధానికి పాల్పడటంపై స్పందించారు జసిండా అర్డెర్న్​. దేశ తుపాకీ (ఆయుధ)చట్టాలను మరింత కఠినతరం చేస్తున్నట్లు ప్రకటించారు. ​

"ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా తుపాకీ లైసెన్సులపై చర్చించి కీలక నిర్ణయం తీసుకుంటాం. కానీ మీకు ఒకటి స్పష్టం చేయాలనుకుంటున్నా. మన తుపాకీ లైసెన్స్​ చట్టాలు కచ్చితంగా మారతాయి."
- జసిండా అర్డెర్న్​, న్యూజిలాండ్​ ప్రధాని.

ఇదీ చూడండీ:ఉగ్ర నరమేధానికి 49 మంది బలి

AP Video Delivery Log - 0300 GMT News
Saturday, 16 March, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0248: New Zealand Suspect Court AP Clients Only 4201194
Attack suspect appears briefly in court
AP-APTN-0222: New Zealand Tributes No Access Australia 4201193
Floral tributes for victims at Christchurch park
AP-APTN-0148: New Zealand Ardern Opposition AP Clients Only 4201192
PM arrives in Christchurch, opposition comments
AP-APTN-0117: New Zealand Hospital No Access New Zealand 4201190
Chief of Surgery: 'some injured in critical condition'
AP-APTN-0104: New Zealand Police No Access New Zealand 4201191
Police: suspect 'not willing to be arrested'
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Mar 16, 2019, 10:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.