ETV Bharat / international

కాబుల్​ ఎయిర్​పోర్ట్ వద్ద ఆత్మాహుతి దాడులు- 13 మంది మృతి

author img

By

Published : Aug 26, 2021, 7:30 PM IST

Updated : Aug 26, 2021, 11:02 PM IST

Explosion outside Kabul airport, casualties unclear at this time
కాబుల్​ ఎయిర్​పోర్ట్ వద్ద పేలుడు- పలువురు మృతి!

19:27 August 26

కాబుల్​ ఎయిర్​పోర్ట్ వద్ద ఆత్మాహుతి దాడులు- 13 మంది మృతి

కాబుల్​ ఎయిర్​పోర్ట్ వద్ద ఆత్మాహుతి దాడి!

భయపడినట్టే జరిగింది. అఫ్గానిస్థాన్​లోని కాబుల్​ అంతర్జాతీయ విమానాశ్రయం వెలుపల వరుస దాడులు (kabul airport explosion) జరిగాయి. దేశం విడిచి వెళ్లిపోయేందుకు వేలాది మంది ఎయిర్​పోర్ట్​ బయట వేచిచూస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.

ఇవి ఆత్మాహుతి దాడులేనని రష్యా విదేశాంగ శాఖ ప్రకటించింది. కాగా, ఈ ఘటనల్లో 13 మంది మరణించారని తాలిబన్ ప్రతినిధులు వెల్లడించారు. మృతుల్లో చిన్నారులు సైతం ఉన్నారని చెప్పారు. కాగా, గాయాలతో సుమారు 60 మంది ఆసుపత్రిలో చేరినట్లు కాబుల్​  లోని ఎమర్జెన్సీ ఆస్పత్రి వెల్లడించింది. 

తొలుత విమానాశ్రయం గేటు వద్ద పేలుడు జరిగిందని.. ఈ ఘటనలో అమెరికా సైనికులతో పాటు పౌరులు మరణించారని పెంటగాన్ ప్రెస్ సెక్రెటరీ జాన్ కిర్బీ తెలిపారు. అబే గేటుకు సమీపంలోని బారోన్ హోటల్ వద్ద మరో పేలుడు జరిగిందని వెల్లడించారు. 

ఇస్లామిక్ స్టేట్ హస్తం!

అయితే ఈ దాడి వెనుక ఇస్లామిక్ స్టేట్ హస్తం ఉందని బలంగా నమ్ముతున్నట్లు ఓ అమెరికా అధికారి తెలిపారు. తాలిబన్ల కన్నా తీవ్రవాదులైన ఐఎస్​ బృందం పౌరులను లక్ష్యంగా చేసుకుందని వెల్లడించారు.

గత కొన్ని గంటల్లో భీకర పేలుళ్లలతో కాబుల్​ విమానాశ్రయం వద్ద పరిస్థితి దారుణంగా దిగజారిందని  అన్నారు ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్. అఫ్గాన్​లోని ఫ్రెంచ్ రాయబారి ప్యారిస్​ తిరిగి వచ్చేస్తున్నట్లు తెలిపారు. మరి కొన్ని వందల మంది అఫ్గానీలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఫ్రాన్స్ ప్రయత్నిస్తుందని హామీఇచ్చారు.

ఉదయం నుంచి భయంభయంగా..

అఫ్గానిస్థాన్​ను వీడి పరాయి దేశాలకు వెళ్లాలనుకుంటున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఫలితంగా కాబుల్​ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఎన్నడూ చూడని రద్దీ కనిపిస్తోంది. ఇదే సమయంలో అనేక దేశాలు తీవ్ర హెచ్చరికలు చేశాయి. ఎయిర్​పోర్ట్ వద్ద దాడులు జరిగే ప్రమాదముందని, అక్కడ ఉండడం సురక్షితం కాదని ప్రజలకు సూచించాయి.

అయినా... ఉదయం నుంచి కాబుల్ ఎయిర్​పోర్ట్ వద్దకు ప్రజలు పోటెత్తుతున్నారు. తమను దేశం దాటించాలంటూ(kabul airport evacuation) అక్కడ ఉన్న అమెరికా బలగాలను వేడుకుంటున్నారు. ఓ దశలో ఎయిర్​పోర్ట్ వద్ద రద్దీ ఎక్కువై... ఉద్రిక్తతలకు దారితీసింది. పరిస్థితిని అదుపు చేసేందుకు భద్రతా సిబ్బంది బాష్పవాయువు, జలఫిరంగులు ప్రయోగించాల్సి వచ్చింది.

కాసేపటికే ఎయిర్​పోర్ట్ వద్ద పేలుడు జరిగింది.

ఇదీ చదవండి: కాబుల్​ ఎయిర్​పోర్ట్ వద్ద ఉద్రిక్తత- వారిపై టియర్ గ్యాస్ ప్రయోగం

Last Updated : Aug 26, 2021, 11:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.