ETV Bharat / international

ప్రపంచంలోనే అతి పెద్ద ఫౌంటెయిన్ ఇదే...

దుబాయ్​లో నిర్మించిన అతిపెద్ద ఫౌంటెయిన్ ఈనెల 22న ప్రారంభం కానుంది. సముద్ర జలాల్లో 14 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఫౌంటెయిన్​లో 3 వేల ఎల్​ఈడీ లైట్లు అమర్చారు. ఇది ప్రపంచంలో అతిపెద్ద ఫౌంటెయిన్​గా గిన్నిస్​ రికార్డుల్లో చోటు దక్కించుకుంటుందని నిర్వాహకులు భావిస్తున్నారు.

Dubai country gears up to begin worlds largest fountain in october
ప్రపంచంలోనే పెద్ద ఫౌంటెయిన్ త్వరలో ప్రారంభం
author img

By

Published : Oct 5, 2020, 3:22 PM IST

దుబాయ్​లో 'పామ్​ ఫౌంటెయిన్'​ పేరుతో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద ఫౌంటెయిన్ అక్టోబర్ 22న ప్రారంభం కానుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. దీంతో, పర్యటక ప్రాంతంగా దుబాయ్​ మరింత మందిని ఆకర్షించనుందని దుబాయ్​ ఫెస్టివల్ అండ్​ రిటైల్​ ఎస్టాబ్లిష్​మెంట్ సీఈఓ అహ్మద్​ అల్​ ఖాజా అన్నారు.

3 వేల ఎల్​ఈడీ లైట్లతో

దుబాయ్​లోని పామ్​జుమేరియా దీవుల్లోని పాయింటే వద్ద నిర్మించిన ఈ ఫౌంటెయిన్.. సముద్ర జలాల్లో 14 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. 3 వేల ఎల్​ఈడీ లైట్ల వెలుగులో 105 మీటర్లు ఎగసిపడే 'పామ్ ​ఫౌంటెయిన్​' నీరు పర్యటకులను మరింత ఆకర్షించనుంది.

5 భిన్న ప్రదర్శనలు

సాయంత్రం 7 నుంచి రాత్రి 12 గంటల మధ్య సమయంలో 20 బెస్పోక్ షోలతో పాటు, 5 విభిన్న ప్రదర్శనలు జరగనున్నాయి. సంగీతంతో ప్రదర్శించనున్న ఈ 'షో'లు వీక్షితులను కనువిందు చేయనున్నాయి. 3 నిమిషాల పాటు సాగే ఒక్కో ప్రదర్శన ప్రతి అరగంటకోసారి జరుగుతుందని నిర్వహకులు తెలిపారు.

" ఈ ప్రాజెక్టును నిర్మించే అవకాశం మాకు రావడం అదృష్టకరం. అద్భుతమైన పామ్​ఫౌంటెయిన్​ నిర్మాణంలో భాగస్వాములవడం ఆనందంగా ఉంది".

--కిన్​ సు, బీజింగ్ వాటర్​ డిజైన్​ టెక్నాలజీ ఛైర్మన్

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.