ETV Bharat / international

చైనాకు డ్రాగన్​ఫ్రూట్​ భయం!.. సూపర్​మార్కెట్లు బంద్ - చైనా వార్తలు తాజా

Dragon Fruit China: ప్రపంచ దేశాలపై కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. మహమ్మారికి పుట్టినిల్లు అయిన చైనాలో కూడా వైరస్​ ఉద్ధృతి తీవ్రంగా ఉంది. కొవిడ్​ వ్యాప్తిని కట్టడి చేసేందుకు కఠిన చర్యలు చేపడుతున్న చైనాను ప్రస్తుతం డ్రాగన్​ ఫ్రూట్​ హడలెత్తిస్తోంది.

dragon fruit china
చైనాకు డ్రాగన్​ఫ్రూట్​ భయం!
author img

By

Published : Jan 8, 2022, 10:48 PM IST

Dragon Fruit China: మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేసేందుకు చైనా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఆ దేశంలో కొవిడ్​ కలకలం కొనసాగుతోంది. తాజాగా.. వియత్నాం నుంచి దిగుమతి చేసుకుంటున్న డ్రాగన్​ ఫ్రూట్​లు ఆ దేశానికి ఆందోళన కలిగిస్తున్నాయి. అందుకే ముందు జాగ్రత్తగా ఆ పండుపై చైనా ఈనెల 26 వరకు నిషేధం విధించింది. అంతేకాదు సూపర్​మార్కెట్లు మూసివేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.

డ్రాగన్​ ఫ్రూట్​లో కరోనా!

వియత్నాం నుంచి దిగుమతి చేసుకున్న డ్రాగన్​ ఫ్రూట్​లో కరోనా ఆనవాళ్లను గుర్తించినట్లు కొన్ని రోజుల క్రితం అధికారులు వెల్లడించారు. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం డ్రాగన్​ ఫ్రూట్​పై జనవరి 26 వరకు నిషేధం విధించింది. వియత్నాం నుంచి డ్రాగన్​ఫ్రూట్​ దిగుమతిని రద్దు చేసింది. ఆ పండు ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు ఆధారాలు లేకపోయినా​ ముందు జాగ్రత్తగా కొనుగోలుదారులు క్వారంటైన్ అవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.

దేశంలోని జేజియాంగ్, జియాన్జి ప్రావిన్సుల్లోని కనీసం తొమ్మిది నగరాల్లో వియత్నాం డ్రాగన్​ ఫ్రూట్​లో కరోనా ఆనవాళ్లను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో దేశంలోని అనేక ప్రాంతాల్లోని సూపర్​మార్కెట్లను తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు మూసివేయాలని స్పష్టం చేసింది.

ఇదీ చూడండి : చైనాలో అర్ధరాత్రి భూకంపం- ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.